Publish Date:Jul 29, 2023
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ ముహూర్తాన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించారో కానీ.. ఆ క్షణం నుంచీ పార్టీకీ, ఆయనకు వరుస కష్టాలు తప్పడం లేదు. జాతీయ స్థాయిలో సత్తా సంగతేమిటో కానీ రాష్ట్రంలో ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందా అంటే పరిశీలకులు మాత్రం అనుమానమనే అంటున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సంస్థలు కలిపి ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతున్నదని తేలింది. ఆ సర్వే పూర్తిగా లోక్ సభ నియోజకవర్గాలలో ఏ పార్టీకి విజయావకాశాలు అన్న విషయానికే పరిమితమైంది. ఆ సర్వేలో తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ సగానికి పైగా సీట్లలో గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నదని తెలింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు లోక్ సభలో తొమ్మిది స్థానాలు ఉన్నాయి. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆ స్థానాలలో కొన్నిటిని బీఆర్ఎస్ కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వే పేర్కొంది. అదే సమయంలో బీజేపీ గెయిన్ అవుతుందని సర్వే తెలపింది.
ప్రస్తుతం బీజేపీకి లోక్ సభలో నాలుగు స్థానాలు ఉంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అదనంగా మరో రెండు లేదా మూడు స్థానాలలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న మూడు స్థానాలను నిలుపుకోవడం ఒకింత కష్టమేనని పేర్కొంది. మజ్లిస్ పార్టీకి తెలంగాణలో ఉన్న ఏకైక లోక్ సభ స్థానాన్ని నిలుపుకుంటుందని సర్వే తేల్చింది. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కు ఈ సర్వే ఫలితం ఒక రకంగా షాక్ అనే చెప్పవచ్చు.
తెలంగాణలో మరింత బలపడి, మహారాష్ట్రలో కూడా గణనీయంగా లోక్ సభ స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్ కు ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సంయుక్తంగా జరిపిన సర్వే ఫలితం కంగుతినిపించేలాగే ఉందని చెప్పడానికి సందేహం అవసరం లేదు. లోక్ సభ స్థానాలలో ఓటమి ఆ నిష్పత్తిలో అసెంబ్లీ స్థానాలలో ఓటమికి సూచనగా పరిశీలకులు చెబుతున్నారు. కేంద్రంలో ఈసారి ఏ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా బీఆర్ఎస్ మద్దతు అనివార్యమని, కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే.అయితే తాజా సర్వేలో కేసీఆర్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెద్దగా ఉండే అవకాశం లేదని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hard-time-to-brs-in-telangana-39-159168.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.