కిస్ డే.. ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే..!

Publish Date:Feb 13, 2025

Advertisement

 


కిస్ డేని వాలెంటైన్స్ వారంలోని 7వ రోజు అంటే ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. ప్రేమలో తగినంత నమ్మకం,  సాన్నిహిత్యం ఉన్న దశకు చేరుకున్నప్పుడు, ప్రేమికులు  తమ ప్రేమను టచింగ్  లేదా ముద్దు పెట్టుకోవడం ద్వారా వ్యక్తం చేస్తారు.   ముద్దు అనేది కేవలం ప్రేమికుల మధ్య జిరిగే చర్య కాదు.. ఒక తల్లి తన బిడ్డను ముద్దు పెట్టినా, ఒక స్నేహితుడు తన స్నేహితుడికి ముద్దు పెట్టినా, తోబుట్టువులు ఆత్మీయంగా ముద్దు పెట్టినా.. ప్రతి ఒక్కటి ఈ కిస్ డే లో భాగమే.. ముద్దు అనేది ప్రేమ,  ఆప్యాయతను వ్యక్తీకరించడానికి ఒక మార్గం మాత్రమే కాదు, ఇది శారీరక,  మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకోవడం,  ఆత్మీయంగా ఉన్నవారిని ముద్దు పెట్టుకోవడం మొదలైన వాటి వల్ల  చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే..

ముద్దు ఒత్తిడిని తగ్గిస్తుంది..

శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్,  సెరోటోనిన్ హార్మోన్లు చాలా ముఖ్యమైనవి. ఇవి  ఒత్తిడిని,  ఆందోళనను తగ్గిస్తాయి.  ఈ హార్మోన్లు శరీరంలో రిలీజ్ అవ్వడంలో ముద్దు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.  ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మనకు ఇష్టమైన వారిని   సంతోషంగా ఉంచుతుంది.


రక్తపోటును నియంత్రిస్తుంది..

మనం ముద్దు పెట్టుకున్నప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది

ముద్దు పెట్టుకున్న  సమయంలో బ్యాక్టీరియా మార్పిడి జరుగుతుంది.  దీని కారణంగా శరీరంలో కొత్త ప్రతిరోధకాలు ఏర్పడతాయి.  రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఏదైనా అంటువ్యాధి సమస్య ఉన్నవారు ముద్దులకు కాస్త దూరం ఉండటం మంచిది.

కేలరీలను బర్న్ చేస్తుంది..

ముద్దు నిమిషానికి దాదాపు 2-6 కేలరీలను బర్న్ చేస్తుందట. ఇది జీవక్రియను పెంచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, ముద్దు పెట్టుకునే పద్ధతి, వ్యవధిని బట్టి నిమిషంలో 2 నుండి 26 కేలరీలు బర్న్ అవుతాయట. ఎందుకంటే ముద్దు శరీరంలోని అనేక భాగాల పనితీరు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ముఖ కండరాలకు మంచిది..

ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖ కండరాలకు మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇది 34 ముఖ కండరాలకు పైగా వ్యాయామంలాగా పనిచేస్తుంది.  ముఖాన్ని టోన్ గా,  యవ్వనంగా ఉంచుతుంది. ఇది ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..

ముద్దు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.   గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనివల్ల గుండెపోటు,  ఇతర హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.


                                                    *రూపశ్రీ.

By
en-us Political News

  
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం..
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం...
పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు...
సినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ  తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.