బాధ్యతల బండిని నడిపే మగమహారాజులకు ఇంటర్నేషనల్ మెన్స్ డే శుభాకాంక్షలు..!

Publish Date:Nov 19, 2024

Advertisement


మగవాడు... ఈ పదం ఏమీ పెద్ద బిరుదు కాదు కానీ, పుట్టిన తర్వాత  బాధ్యతగా పెరిగి, తన కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ఉన్నతమార్గంలో నడిపించటానికి పాటుపడుతున్న ప్రతివాడూ మగాడే.. మొనగాడే... అటువంటి వారిని గుర్తించి,  వాళ్ళని అలా మార్చే విషయాల గురించి, అలా మారకుండా చేసే విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మగాడు సరిగా లేకపోతే.. అంటే బాధ్యతగా లేకపోతే అతని కుటుంబం, కుటుంబ సభ్యులు మానసికంగానూ, ఆర్థికంగాను, సామాజికంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ప్రతీ సంవత్సరం నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరుపుకుంటున్నారు.


ఈ రోజు పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, రాజకీయపరంగా  వారు  చేస్తున్న సేవలను  జ్ఞాపకం చేసుకోవడమే లక్ష్యం.  పురుషులు సమాజంలో తీసుకొచ్చే మంచి మార్పులని గుర్తు చేసి, వారిని ఆదర్శంగా చూపించే వీలు కల్పించే రోజు ఇది.  

పురుషుల భావోద్వేగ స్వేచ్ఛ, పెరుగుతున్న  పురుషుల ఆత్మహత్యలు  వంటి అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి వేదికగా నిలుస్తుంది.

 పురుషులు కూడా ఇతరుల మాదిరిగా మామూలు మనుషులేనని, వారికీ బాధ, నిరాశ కలిగినప్పుడు భావోద్వేగ మద్దతు అవసరమే అని  సమాజం గుర్తించేలా ప్రేరేపిస్తుంది.  సమాజంలో ఎప్పటినుంచో స్థిరపడిపోయిన కొన్ని భావనలు, పురుషులు తమ  భావోద్వేగాలను స్వేచ్ఛగా బయటపెట్టనివ్వకుండా చేస్తున్నాయి.  ‘మగ పిల్లాడు ఏడవటం ఏంటిరా? చూస్తే నవ్వుతారు’ అంటారు చాలా మంది. దాంతో వాళ్ళు తమ బాధ బయటపెట్టరు.   ఇది వారి మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇందుకే మగాళ్ళు చాలా కరుకు స్వభావం కలిగి ఉంటారు అంటారు. ఈ సమస్యలను గుర్తించటం ద్వారా  ఇంటర్నేషనల్ మెన్స్ డే మగావారి జీవితంలో మార్పులు తీసుకువస్తుంది.

కుటుంబంలో, వివిధ రంగాల్లో,   సమాజంలో పురుషులు అనేక పాత్రలను పోషిస్తారు. కంటికి రెప్పలా కాపాడే  తండ్రిలా, మద్దతు ఇచ్చే అన్నగా, నమ్మకమైన స్నేహితుడునిగా, ప్రేమించే భాగస్వామిగా, సమాజంపట్ల బాధ్యత ఉన్న మనిషిగా పురుషులు చుట్టూ ఉన్నవారి కోసమే జీవితాన్ని   వెచ్చిస్తారు. ఇంత చేసినా వారి కృషి, త్యాగానికి అంతగా   గుర్తించబడవు. మెన్స్ డే ఈ విషయాలను గుర్తించేలా చేస్తుంది.


పురుష దినోత్సవం సందర్భంగా కొన్ని లక్ష్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కొన్ని  ప్రధాన లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి..


నైతిక విలువలు, బాధ్యతలు కలిగిన మగవారిని గుర్తించి, వారిని ఆదర్శంగా చూపించడం. ఇలా చేయడం వల్ల మగవారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం సాధ్యం అవుతుంది. 
  
స్త్రీ, పురుషుల మధ్య పరస్పర గౌరవం, సహకారాన్ని ప్రోత్సహించటం. ఇలా చేస్తే ప్రతి మగవాడి నుండి స్త్రీ కి సంరక్షణ, సహాయ సహకారాలు అందుతాయి.

పురుషులు ఎదుర్కొనే సవాళ్లను హైలైట్ చేయడం  ప్రధానం. కుటుంబ జీవితంలో, పనిచేసే చోట, బయట సమాజంలో   పురుషులు ఎదుర్కొనే ఒత్తిడి, ఇతర అనేక సమస్యల గురించి అవగాహన కల్పించటం. ఇది మగవారిలో నిగూఢంగా దాగున్న శక్తిని, వారి మానసిక స్వభావాన్ని బయటపెడుతుంది.

మన సమాజం పురుషాదిక్యంలా కనపడుతున్నప్పటికీ బాధపడుతున్న, అణచివేయబడుతున్న అమాయకపు పురుషులు కూడా ఉంటారు, చాలాసార్లు తప్పుడు ఆరోపణల వల్ల  వాళ్ల జీవితాలనే కోల్పోతుంటారు. అటువంటివారిని కాపాడేందుకు  న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.


ఇంటర్నేషనల్ మెన్స్ డే ప్రధానంగా పురుషుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. గణాంకాల ప్రకారం, పురుషులు తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు.  వైద్య సహాయం తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు. అందుకే మెయిన్స్ డే రోజు రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టటం వంటి విషయాలపై చర్చలను ప్రోత్సహిస్తుంది.

ఇంటర్నేషనల్ మెన్స్ డే కేవలం పురుషులకే సంబంధించినది కాదు,  ఇది లింగ సమానత్వాన్ని మెరుగుపరచడం, మంచి సంబంధాలను నెలకొల్పడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.  అప్పుడే  పురుషులు, స్త్రీలు కలిసి శాంతి కోసం, ప్రగతి కోసం  పనిచేస్తారు.

ప్రతిమగవాడు తనకు  ఒక కుటుంబం ఏర్పడ్డాక తన జీవితాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తాడు. కుటుంబ సంతోషమే తన సంతోషం అని అనుకుంటాడు. తల్లి పడే కష్టం పిల్లల కాళ్ళ ముందు కనబడితే తండ్రి కష్టం కనిపించదు. అలా మగవాడి కష్టం బయటకు కనిపించదు. కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం, సమాజం కోసం నిస్వార్థంగా తనను తాను కోల్పోయే మగాళ్ళు ఎప్పుడూ గౌరవించబడాలి. అలాంటి మగ మహారాజులకు అందరికీ హ్యాపీ మెన్స్ డే..! 


                               *రూపశ్రీ 

By
en-us Political News

  
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.