అంబేద్కర్.. భారత చరిత్రను మార్చిన అద్బుతం..!
Publish Date:Apr 14, 2026
Advertisement
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి. ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే.. అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు.. రాజ్యాంగ నిర్మాత.. భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత రాజ్యాంగమే.. ఈ బారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు. విద్యావంతుడు.. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు. అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యారు. సామాజిక సంస్కర్త.. ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు. భారతరత్న.. 1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు. సత్యాగ్రహి.. నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే. అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. *రూపశ్రీ.
అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు.
న్యాయ శాఖ మంత్రి..
http://www.teluguone.com/news/content/happy-ambedkar-jayanti-35-217305.html





