తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముగ్గురు బాలికలపై పాశవికంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆనవాళ్లు దొరక్కుండా అత్యంత కిరాతంగా చంపేసి బావిలో పాతిపెట్టిన నరరూప రాక్షసుడు శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష విధించింది. హాజీపూర్ హర్రర్ కేసుల్లో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డిని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు... మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ రెడ్డే నేరం చేశాడని నిరూపించేందుకు డీఎన్ఏ, బ్లడ్ టెస్ట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్... ఇలా అనేక టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సమర్పించడంతో తప్పించుకోలేకపోయాడు. పోలీసులు అందజేసిన ఎవిడెన్స్ ఆధారంగా ముగ్గురు బాలికలను శ్రీనివాస్ రెడ్డే అత్యాచారం చేసి హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. మొత్తం 101మంది సాక్షులను సుదీర్ఘంగా విచారించిన కోర్టు... శ్రావణి, కల్పన, మనీషా కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేల్చింది.
అయితే, మూడు కేసుల్లోనూ నేరం రుజువైందంటూ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి న్యాయమూర్తి తెలియజేయగా, తనకేం సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు కావాలనే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ జడ్జికి విన్నవించుకున్నాడు. తన తల్లిదండ్రులను తానే పోషించాలని... తన ఇల్లు కూల్చేశారంటూ న్యాయమూర్తికి తెలియజేశాడు. భూతగాదాలతోనే తనను ఈ కేసుల్లో ఇరికించారంటూ న్యాయమూర్తికి చెప్పుకున్నాడు. అయితే, నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసా? అసలు, మీ తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అంటూ శ్రీనివాస్ రెడ్డిని జడ్జి ప్రశ్నించగా, తనకు తెలియదని అతను సమాధానమిచ్చాడు.
మొత్తానికి హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో మర్రి శ్రీనివాస్ రెడ్డికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై బాధితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే, వెంటనే ఉరిశిక్ష అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hajipur-serial-killer-srinivas-reddy-sentenced-to-death-25-93924.html
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.