Publish Date:Aug 29, 2022
మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపైనా, బీజేపీపైనా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను రాజకీయాలలో లేకుండా ఉన్నట్లైతే వారి (బీజేపీ) నాలుకలు చీరేసి ఉండేదాన్నని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మమతా సోమవారం (ఆగస్టు 29) ప్రసంగించారు.
బీజేపీ వారు అందరిపైనా ‘దొంగలు’ అన్న ముద్ర వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, బీజేపీకి అక్రమంగా సంక్రమించిన సొమ్ముతో రాష్ట్రాలలో ప్రజలెన్నుకున్న బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు.2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీని ఓడించి తీరుతానని శపథం చేశారు. తమను వ్యతిరేకించే వారందరిపైనా బీజేపీ ‘దొంగలు’ అన్న ముద్ర వేస్తోందన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న మనమంతా దొంగలం, ఒక్క బీజేపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు మాత్రమే సచ్ఛీలురు అన్నట్లుగా వారి ప్రచారం ఉందన్నారు. తనతో సహా తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్హాద్ హకీమ్, అభిషేక్ బెనర్జీ వంటి సీనియర్ నేతలకు వ్యతిరేకంగా దుర్మార్గమైన ప్రచారానికి బీజేపీ తెరలేపిందన్నారు. తాజాగా ఫిర్హాద్ హకీమ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేశాయనీ, బహుశా హకీమ్ ను త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అన్నారు. ఒక వేళ హకీమ్ ను అరెస్టు చేసినా ఎవరూ ఖంగారు పడవద్దనీ, ఆయనపై నమోదు చేసింది తప్పుడు కేసేననడంలో సందేహం లేదనీ మమతా బెనర్జీ అన్నారు.
\కేవలం ఆయనను వేధింపులకు గురి చేసేందుకే బీజేపీ తప్పుడు కేసులు బనాయిస్తున్నదని విమర్శించారు. తృణమూల్ నేతల వద్ద కట్టల కొద్దీ సొమ్ము ఉందంటూ బీజేపీ వారు ఆరోపణలు చేస్తున్నారనీ, వాస్తవంగా రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ వారికి అంత సొమ్ము ఎలా సమకూరిందో వారే చెప్పాలన్నారు. హవాలా ద్వారా బీజేపీ కోట్లాది రూపాయలను విదేశాలలో దాచేసిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని ఓడించి తీరాలన్నారు. బేటీ బచావో గురించి మాట్లాడే బీజేపీ బిల్కిస్ బానో అత్యాచార దోషులను ఎలా విడుదల చేసిందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బిల్కిస్ బానో అత్యారార దోషులపై చర్యలకు డిమాండ్ చేస్తూ తాను కోల్ కతాలో 48 గంటల పాటు ధర్నా చేయనున్నట్లు మమతా బెనర్జీ ఈ సందర్భంగా వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/had-i-not-been-in-politics-25-142888.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.