ఈ నాలుగు అలవాట్లు ఉండే చాలు.. ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు!

Publish Date:Apr 10, 2026

Advertisement

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు.. ఇలా జీవితం ఎంత సాఫీగా గడుస్తోంది అనుకున్నా.. మనిషి లోపల మాత్రం మనసు తృప్తిగా, సంతోషంగా అనుభూతి చెందడం లేదు. చాలామందిలో ఈ గందరగోళం కనిపిస్తూ ఉంటుంది.  ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి రివర్స్ గా.. సంతోషంగా ఉండే వ్యక్తులు మాత్రం జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా అధిగమించగలరు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలరు,  వీరికి జీవితం అసలు కష్టంగా అనిపించదు.  కానీ సంతోషంగా ఉండటం ఎలా.. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం కేవలం నాలుగు అలవాట్ల వల్ల సాధ్యం అవుతుందని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు.  ఆ నాలుగు అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..

జాగ్రత్తగా వినడం..

కొంతమంది తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు, ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినగలిగే వ్యక్తులు జీవితంలో ఎన్నో సమస్యలను క్లిష్టతరం కాకుండా,  అసలు సమస్యలుగా మారకుండా ముందుగానే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. తద్వారా జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత సమస్యలు ఏవీ వారికి ఉండవు.

పాజిటివ్ మైండ్ సెట్..

సానుకూల భావాలు అంటే పాజిటివ్ మైండ్ సెట్  ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ జీవితాలతో సంతోషంగా ఉంటారు,  వారికి దొరికే ఏ కొద్ది సమయాన్ని అయినా సంతోషంగా గడపడానికి,  ఆ సమయాన్ని మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి, పదిలపరుచుకోవడానికి ఇష్టపడతారు. ఈ విషయాలు క్రమంగా వారిని సంతోషంగా ఉంచుతాయి.

ఒత్తిడికి దూరంగా ఉండటం..

సంతోషంగా ఉండే వ్యక్తులకు ఒత్తిడి లేకుండా నిద్రపోవడం  అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు  సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది.  నిద్రపోయేటప్పుడల్లా అస్సలు  ఏ చింతా లేకుండా,  ఏ సమస్య గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నం చేయాలి.  ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది.

తమ మీద తాము జాలి పడటం..

ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తులు తమ మీద తాము జాలి పడటం అస్సలు పాటించరు. వారు ఏదో ఒకటి నేర్చుకుని, తప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పులను తాము దాచిపెట్టడం లేదా తమ అసమర్థతను ఒప్పుకోకుండా ఇతరులతో గొడవ పడటం లాంటివి చేయరు.  

పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.  ఆ లక్షణాలు వ్యక్తులను సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి,  సహాయపడతాయి కూడా.

                                         *రూపశ్రీ
 

By
en-us Political News

  
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.