జీవీరెడ్డిలా పని చేయండి.. కూటమి నేతలు, మంత్రులపై పెరుగుతున్న ఒత్తిడి!

Publish Date:Dec 26, 2024

Advertisement

వైసీపీ హయాంలో మంచి చెడ్డలు, తప్పొప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకం అని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులం స్వాగతం పలికేది. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసే వారు. నోటీసుల మాటే లేదు. అనుకుంటే జైల్లో తోసేయడమేనన్నట్లుగా పరిస్థితి ఉండేది. తెలుగుదేశం, జనసేన నేతలూ కార్యకర్తలనే కాదు.. జగన్ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారికి ఇక భూలోకంలో నరకం చూపించడానికే రక్షక భటులు ఉన్నారన్నట్లుగా జగన్ హయాంలో అరాచకత్వం రాజ్యమేలింది. 

ఐదేళ్ల పాటు జగన్ అరాచక, విధ్వంస పాలనను పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికలలో తమ సత్తా చాటారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం ఇవ్వకుండా జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు.  జగన్ ఐదేళ్ల హయాంలో అష్టకష్టాలూ పడిన తెలుగుదేశం శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ మెప్పు కోసం ఉచ్ఛ నీచాలు మరిచి మరీ చెలరేగిపోయిన వారిపై చర్యలు ఉంటాయని ఆశించారు.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచినా గత పాలనలోని అవినీతి నాయకులపై ప్రభుత్వం  చర్యలు తీసుకోవడం లేదన్న నిరాశ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.  అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు, అధికారుల పేర్లు నమోదు చేశానంటూ లోకేష్ చూపిన రెడ్ బుక్ లో ఉన్న వారిపై చర్యలూ ప్రారంభం కాలేదు. అంతే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలతో చెలరేగిపోయిన వైసీపీయుల తీరు ఇప్పటికీ మారలేదు. దీంతో తెలుగుదేశం శ్రేణులలో అసహనం పెచ్చరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 

సరిగ్గా ఈ తరుణంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీశారు.   అక్కడితో ఆగకుండా ఫైబర్ నెట్ లో దొడ్డిదారిన కొలువులు పొందిన అనర్హులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా జగన్ కోసం తీసిన సినిమాలకు ఫైబర్ నెట్ ద్వారా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దారితప్పిన నిధుల రికవరీ కోసం లీగల్ నోటీసు కూడా పంపాడు. అంతే కాకుండా జగన్ ప్రాపంకంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారిన అక్రమంగా కొలువులు పొందిన  410 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించారు. మరో 200 మందికి ఉద్యోగాల నుంచి ఎందుకు ఉద్వాసన పలకరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  ఇలా దొడ్డిదారిన ఏపీ ఫైబర్ నెట్ లో కొలువులు పొందిన వారు ఎన్నడూ కార్యాలయానికి వచ్చిన పాపాన పోలేదు. కానీ కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద మొత్తాలలో జీతాలు తీసుకుంటున్నవారే.  జగన్ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో  అవకతవకలను బటయపెట్టి చర్యలకు ఉపక్రమించి జీవీ రెడ్డిపై  తెలుగుదేశం కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 ఇప్పుడు జగన్ హయాంలో అవినీతికి పాల్పడిన వారిపై, అక్రమాలకు తెగించిన వారిపై  చర్యలు తీసుకోవాలంటూ, రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారిపై కొరడా ఝుళిపించడంలో ఇంకా జాప్యం ఎందుకంటూ లోకేష్ సహా మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. జీవీరెడ్డి మాదిరిగానే అక్రమార్కులపై చర్యల విషయంలో వేగంగా స్పందించాలన్న డిమాండ్ పేరుగుతోంది. 

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.