Publish Date:Jul 25, 2021
జీవీఎల్ నరసింహారావు. ఊరికే రారు మహానుభావుడు. ఆయన వచ్చారంటే.. ఎవరికో ఎసరు పెడుతున్నట్టే. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో తిష్టవేసి.. ఇటు బీజేపీ తరఫున, అటు అనధికారికంగా కేంద్ర పక్షాన.. ఏపీ వ్యవహారాలు చక్కబెడుతుంటారు జీవీఎల్. చక్క బెట్టడం కంటే కూడా.. చిక్కు పెట్టడంపైనే ఆయన ఎక్కువగా దృష్టి సారిస్తుంటారనే పేరు. కొంతకాలంగా ఏపీ విషయంలో సైలెంట్‌గా ఉంటూ వస్తున్న జీవీఎల్.. మళ్లీ ఇప్పుడు స్వరం పెంచారు. ఏపీ వ్యవహారాల్లో దూకుడు పెంచారు. ఆయన ఎక్కువ ఫైనాన్సియల్ మేటర్స్‌లోనే.. వేలు పెట్టి కెలుకుతుంటారు. పీడీ బిల్లులేవంటూ ఇటీవల ఏపీ సర్కారును నిలదీశారు. తాజాగా, ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ముందు దోషిగా నిలబెట్టేలా.. అప్పులపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చేస్తున్న సీఎం జగన్ అడ్డగోలు విధానాలపై స్వయంగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఏపీ.. అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందనే విషయం దేశం మొత్తం తెలిసిందంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కొత్త అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతీరోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. అప్పులకోసమే ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎస్‌డీసీ) ఏర్పాటు చేసినట్టుందని.. అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించేలా ఉందంటూ తప్పుబట్టారు. ఈ విషయాలన్నిటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నారు జీవీఎల్.
ఎస్‌డీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అప్పుల మంత్రిగా కనిపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ప్రతీరోజూ కొత్త అప్పుల కోసం పడరాని పాట్లు పడుతున్నారని.. ఏపీ అప్పులపై కాగ్, ఆర్బీఐతో ఆడిట్ చేయాలని కేంద్రాన్ని కోరతానని జీవీఎల్ అన్నారు.
జీవీఎల్ అభిప్రాయమే బీజేపీ అభిప్రాయం. కేంద్రం ఏపీని టార్గెట్ చేయాలని అనుకుంటే.. ముందు జీవీఎల్‌ను రంగంలోకి దింపుతుంది. ఆయనతో ప్రభుత్వ పరువంతా తీయిస్తుంది. ఆ తర్వాత యాక్షన్‌లోకి దిగుతుంది. జీవీఎల్ మాటలను బట్టి చూస్తుంటే.. కేంద్రం జగన్ సర్కారుకు సహాయ నిరాకరణ చేయబోతోందని అర్థమవుతున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని అటకెక్కించేసి.. ఏపీని అప్పుల కుప్పగా మార్చేసిన సీఎం జగన్ తీరుపై కేంద్రం గుర్రుగా ఉందని అంటున్నారు. అందుకే, జగన్ ముందరి కాళ్లకు బంధాలేసేందుకే జీవీఎల్‌తో కేంద్రానికి ఫిర్యాదు చేయించబోతున్నట్టు సమాచారం. ఆ తర్వాత ఇక అసలైన యాక్షన్ మొదలవుతుందని చెబుతున్నారు. అయితే, ఈ చర్యలు కేవలం ఆర్థిక విధానాల వరకే పరిమితమవుతుందా? లేక, సీబీఐ విచారణ, జగన్ బెయిల్ రద్దునూ ప్రభావితం చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gvl-focus-on-ap-and-cm-jagan-25-120298.html
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.