అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..జీవీఎల్ బోల్తాపడ్డాడు!

Publish Date:Jun 13, 2023

Advertisement

ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందన్నది సామెత.  బీజేపీ ఎంపీ జీవీఎల్ పరిస్థితి సరిగ్గా ఆ సామెతకు తగినట్టు సరిపోతుంది. ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా ఎందుకు మారిపోతోందో.. బీజేపీ నాయకత్వానికి జేవీఎల్ కారణంగానే  స్పష్టంగా అర్థమైపోయింది.  ఏపీలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు గురించి బీజేపీ అధిష్ఠానానికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కానీ తెలుగుదేశం ఎన్డీయే భాగస్వామిగా ఉన్న సమయం నుంచీ.. రాష్ట్ర పరిస్థితుల గురించి తనదైన శైలిలో రిపోర్టులు ఇస్తూ హైకమాండ్ కు దగ్గరైన జీవీఎల్. ఆ ఫిర్యాదులన్నిటినీ పూర్వ పక్షం చేసేలా పార్టీ హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించారు.

2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం, వైసీపీ విజయంతో జీవీఎల్ సమాచారంపై అధిష్టానం నమ్మకం పెంచుకుంది. అందుకే పలుకుబడి ఉన్న కన్నాను తప్పించి మరీ సోము వీర్రాజుకు జీవీఎల్ సిఫారసుపై పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తరువాత పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏపీలో ఏకంగా అధికార పార్టీ నేతలు బీజేపీ సీనియర్ నేతలపైనే దాడులకు పాల్పడటం వంటి సంఘటనలతో అధిష్ఠానం బీజేపీపై దృష్టి సారించింది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడవాడలా చార్జ్ షీట్లు వేయాలంటూ సాక్షాత్తూ మోడీ ఇచ్చిన ఆదేశాలే అమలుకు నోచుకోకపోవడంతో  బీజేపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. స్వయంగా రంగంలోకి దిగడంతో అనివార్యంగా చార్జ్ షీట్ల కార్యక్రమం చేపట్టింది.

కానీ అది తూతూ మంత్రంగానే సాగుతోంది.  సరిగ్గా ఈ సమయంలోనే మోడీ 9 ఏళ్ల పాలన విజయాలను ప్రజలలో ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోనే అమిత్ షా ఏపీలో పర్యటించారు. నడ్డా శ్రీకాళహస్తిలో, అమిత్ షా విశాఖలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. మోడీ ప్రభుత్వ విజయాల ప్రచారం కంటే తమతమ ప్రసంగాల్లో రాష్ట్రంలోని జగన్ సర్కార్ వైఫల్యాలు, అక్రమాలు, అవినీతిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి విమర్శలు గుప్పించారు. నడ్డా ప్రసంగంపై వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడ్డారు. అది పక్కన పెడితే విశాఖలో అమిత్ షా ప్రసంగాన్ని అనువదించిన జీవీఎల్ కు   అ సభావేదికపైనే ఘోర పరాభవం జరిగింది. తన ప్రసంగ అనువాదంలో జీవీఎల్ సొంత పైత్యం జోడిస్తున్నారని అర్థమైన అమిత్ షా వేదికపైనే నేనేం మాట్లాడుతున్నా మీరేం చెప్తున్నారంటూ నిలదీశారు.

దీంతో ఒక్కసారిగా కంగుతిన్న జేవీఎల్ అవమానంతో తలదించుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే అమిత్ షా జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల వాడిని తగ్గించి.. అమిత్ షా ప్రసంగ సారాన్ని నిర్వీర్యం చేసేలా జీవీఎల్ అనువాదం ఉంది. ఆ విషయాన్ని అమిత్ షా గుర్తించి వార్నింగ్ ఇచ్చారు. దీంతో జీవీఎల్గత్యంతరం లేక అమిత్ షా ప్రసంగ పాఠాన్ని ఉన్నదున్నట్లుగా అనువాదం చేసి చెప్పాల్సి వచ్చింది. అయితే అప్పటికే జగన్ పై అమిత్ షా చేసిన ఎన్నో విమర్శలను జీవీఎల్ సభలో చెప్పలేదు. వాటిని  స్కిప్ చేశారు. షా నిలదీసిన తరువాతే.. ఒక ప్యాడ్ తీసుకుని ఆయన మాటలు రాసుకుని అనువాదం చేశారు.

ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం వద్ద కానీ, పార్టీ రాష్ట్ర శాఖలో కానీ జీవీఎల్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న జీవీఎల్ కు ఇప్పుడు లోక్ సభ స్థానం కాదు కదా.. కనీసం త్వరలో ముగియనున్న ఆయన రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరించే అవకాశం కూడా లేదని పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిథి హోదా కోల్పోయిన జేవీఎల్ కు ముందు ముందు బీజేపీలో మరిన్ని పరాభవాలు తప్పవని పార్టీ నేతలు చేబుతున్నారు.  

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.