Publish Date:Jun 23, 2025
గుంతకల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి వివాదాల సుడిలో చిక్కుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నియోజకవర్గ తెలుగుదేశం సంస్థాగత కమిటీల నియామకానికి సంబంధించి గుంతకల్లులోని ఓ కళ్యాణమండపంలో మూడు రోజుల కిందట నిర్వహించిన సమావేశంలో గుమ్మనూరు జయరాం మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేయాలని, లేదంటే వారి తోక కత్తిరించి సున్నం పెడతామని హెచ్చరించారు. అలాగే వైసీపీ తరపున ఎవరూ నామినేషన్లు వేయకుండా చూడాలని తెలుగుదేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వైసీపీ నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే రెడ్ బుక్ ఓపెన్ చేస్తానన్నారు. కాగా.. ప్రజాస్వామిక హక్కులు కాలరాసేలా మాట్లాడిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజలు తోక కోసి సున్నం పెడితేనే జయరాం గుంతకల్లుకు వలస వచ్చి... చంద్రబాబు దయతో ఎమ్మెల్యే అయ్యారని వారు ఎద్దేవా చేశారు. గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో తన కుటుంబీకులను సామంత రాజుల్లా పెట్టుకుని జయరాం పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాగే వ్యవహరిస్తే జిల్లా ప్రజలు కూడా ఆయనను తరిమి కొడతారని హెచ్చరించారు.
కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గుమ్మనూరు జయరాం కు ఇదే మొదటి సారి కాదు. తనపై ఆధారాల్లేకుండా వార్తలు రాసే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారమే రేపాయి. జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని ఆయన చేత వివరణ ఇప్పించాల్సి వచ్చింది. దీంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. అయినా, ఆయనలో మార్పు రాలేదని ప్రస్తుత వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. గతంలో వైసీపీ తరపున ఆలూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పలుమార్లు తన నోటి దురుసు ప్రదర్శించారు. టీడీపీలోకి వచ్చాక కూడా ఆయన అదే పద్ధతిలో మాట్లాడుతూం డడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ఎన్నికల ముందు ఆయనను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణం టీడీపీ అధినేతను, లోకేశ్ ను గతంలో ఆయన తీవ్ర పదజాలంతో దూషించి ఉండడమే. ప్రత్యర్థుల చేత నామినేషన్లు కూడా వేయనివ్వకుండా స్థానిక ఎన్నికలను గత వైసీపీ ప్రభుత్వం ఏకపక్షం చేసిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/guntakal-mla-gummanuru-in-dispute-25-200498.html
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్‌కు కుక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్‌లో భోజనం అందుకున్నారు.
ఏపీ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టులో పది రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు సభాపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మొన్నటి విశ్వవసు నామ సంవత్సర ఉగాది పంచాంగం చదువుతుండగా ఆ పండితుడు చెప్పిందేంటంటే జగన్ కి స్త్రీ మూలక సమస్యలు ఎక్కువగా వస్తాయని. ఆ సరికే ఆయన తన తల్లి చెల్లితో పీక లోతు పోరాటం చేస్తున్నారు. కేసులు గట్రా వ్యవహారాలు నడుస్తున్నాయ్.