Publish Date:Mar 29, 2025
హైద్రాబాద్ బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీతో భయభ్రాంతులకు గురి చేశాడు. శుక్రవారం అర్దరాత్రి కొందరు యువకులు ఓ పెన్ టాప్ జీప్ లో చేసిన రచ్చ సృష్టించారు. ఏకంగా జీపు డ్యాష్ బోర్డుపై తుపాకీకి ఉంచి చేసిన విన్యాసాలను చిత్రీకరించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. సుమోటాగా స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీ తీసిన అకతాయి అప్సర్ ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడితో పాటు తుపాకీ విన్యాసాలను చేసిన ఆకతాయిలను పోలీసులు అదుపులో తీసుకున్నారు
హైద్రాబాద్ లో తుపాకీతో హడావుడి చేయడం కొత్త కాదు. అనేక చోట్ల ఇలా విన్యాసాలు చేయడం మామూలైంది. 2022 అక్టోబర్ లో బహదూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు. యుపిఐ ద్వారా పేమెంట్ చేస్తానని చెప్పి వెళ్లిపోతుండగా బంక్ నిర్వాహకులు అడ్డుకున్నారు. ఆ యువకుడు మరో ఇద్దరు యువకులను పిలిపించి బంక్ సిబ్బందిపై దాడి చేశాడు. వచ్చిన ఇద్దరుయువకుల్లో ఒకరివద్ద గన్ ఉంది. సిబ్బందికి గన్ చూపిస్తూ నానాహంగామా చేశాడాయువకుడు. ఈ ఘటనలో పోలీసులు ఇప్తెకార్ ను అరెస్ట్ చేశారు.
2021 మార్చిలో తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ గ్రేటర్ హైద్రాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఎంఎల్సి ఎన్నికల సంబురాల్లో తన లైసెన్స్ గన్ తీసి గాల్లో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. కార్యకర్తలు వారించడంతో గన్ లోపల పెట్టుకున్నాడు.
2024లో బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద కొందరు యువకులు తుపాకీతో రోడ్ల మీద తిరిగారు.
2016 మార్చిలో నకిలీ పోలీస్ డమ్మీ రివాల్వర్ తో హల్ చల్ చేశాడు ప్రేమ జంటలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ నకిలీ పోలీస్ ను ఎన్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంవత్సరం జనవరిలో బీదర్ ఎటిఎం దొంగల ముఠా అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యారు.
హైద్రాబాద్ లో సంఘ విద్రోహశక్తులు తుపాకీలతో విన్యాసాలు చేస్తున్నా పౌరులు సామాజిక బాధ్యతగా స్పందించి పోలీసులకు సమాచారం ఇస్తున్న దాఖలాలు లేవు. తాజాగా బంజారాహిల్స్ లో అకతాయిల విన్యాసాలపై పోలీసులకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ అయినదాన్ని పోలీసులే స్పందించి సుమోటాగా కేసు నమోదు చేయాల్సి వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gunman-gun-show-in-banjara-hills-police-register-a-case-as-a-fir-39-195212.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.