Publish Date:Aug 17, 2022
కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ బిగ్ షాక్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నియమించారు. కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని పార్టీ అధిష్ఠానం బుధవారమే ప్రకటించింది. ఆ కమిటీ చైర్మన్ గా గులాం నబీ ఆజాద్ ను నియమించింది. అయితే తన నియామకాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే గులాం నబీ ఆజాద్ ఆ పదవికి రాజీనామా చేశారు.
అంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యత్వానికి కూడా ఆజాద్ రాజీనామా చేశారు. అలాగే క్యాంపెయిన్ కమీటీ సభ్యులలో మరో ముగ్గురు కాశ్మీరీ నేతలకు కూ డా కమిటీకి రాజీనామాలు సమర్పించారు. ఇది నిజంగానే కాంగ్రెస్ కు తేరుకోలేని షాక్ అనే చెప్పాలి.
అసలే కాశ్మీర్ లో కాంగ్రెస్ ఉనికి అంతంత మాత్రం. ఇప్పుడు క్యాంపెయిన్ కమిటీకి ఆజాద్ సహా నలుగురు రాజీనామా చేయడం కాంగ్రెస్ కు తేరుకోలేని ఎదురుదెబ్బే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో సీనియర్ నేత అయిన గులాబ్ నబీ ఆజాద్ గత కొంత కాలంగా అధిష్ఠానం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడంతో మరింత రగిలిపోతున్నారు.
గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ తనకు పదవులు అప్పగించిన సందర్భాన్ని తన అసంతృప్తిని మరింత బాహాటంగా వ్యక్తం చేయడానికి వచ్చిన అవకాశంగా ఉపయోగించుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gulab-nabi-azad-resigns-to-jk-campaign-committee-chairman-post-25-142125.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.