Publish Date:Feb 17, 2026
తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇటీవల పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి .. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం పెను సంచలనం సృష్టించడంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు కనిపించింది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం మహిపాల్ రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా ఇస్నాపూర్ పురపాలక సంఘం ఛైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుంది. ఇస్నాపూర్ మున్సిపల్ ఛైర్మన్‌గా మోటే సుమలత.. వైస్ ఛైర్మన్‌గా పట్లోళ్ల మాధవి ఎన్నిక అయ్యారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న గూడెం మహిపాల్ రెడ్డి.. ఓటు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, స్థానిక నేతలను ఉద్దేశించి పరోక్షంగా .బుల్లెట్ దిగిందా, లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ లో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 10 వార్డులు, బీఆర్ఎస్ 12, ఇండిపెండెంట్లు 4 వార్డుల్లో గెలుపొందారు. వారిలో ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లగా మరొకరు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెరో 13 ఓట్లు చేరాయి. దీంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ తమదే అని ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఎక్స్ అఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gudem-mahipalreddy-shows-strength-in-patancheru-segment-39-214201.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.