కుక్కలు చింపిన విస్తరిలా నెల్లూరు వైసీపీ.. ఆధిపత్య పోరుతో పార్టీ ఖ‌తం..

Publish Date:Apr 19, 2022

Advertisement

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య గ్రూప్ వార్ రోజు రోజుకూ మరింతగా ముదిరిపోతోంది. నెల్లూరు జిల్లాలోని వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ముందు నుంచే ఉన్న వర్గ విభేదాలు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత మరింతగా బరి తెగించి మరీ బయటకు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పలంటే ఈ గ్రూప్ వార్ ప్రధానంగా తాజా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి- తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య జరుగుతోందని అంటున్నారు. వీరిద్దరితో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు రెండు గ్రూపులుగా మారిపోయి కయ్యానికి సై అంటే సై అంటున్నారు.

నెల్లూరు వైసీపీ నేతల గ్రూర్ వార్ ఎంతవరకు వచ్చిందంటే ఒకరి కోసం వేసిన ఫ్లెక్సీలను మరొకరు రాత్రికి రాత్రే చింపేసి, పీకేసి, ధ్వంసం చేసే వరకూ వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తాజాగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. నెల్లూరు జిల్లా నేతల్ని అదుపులో ఉండాలని వైసీపీ అధినేత వార్నింగ్ లు ఇచ్చినా.. తగ్గేదేలే అనే రీతిలో వారు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. మొన్న తాజా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీని తీసిపడేశారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా చింపేయడం నెల్లూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.

అయితే.. ఈ ఫ్లెక్సీల ధ్వంసం వెనుక తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హస్తం ఉందని కొందరు ఆరోపిస్తుండడం గమనార్మం. తనకు మంత్రి పదవి కొనసాగించకపోవడమే కాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం అనిల్ ఏ మాత్రం సహించలేకపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే కాకాని నెల్లూరుకు మరునాడు వస్తున్నారనగానే అనిల్ కుమార్ మీడియా సమావేశంలో.. తనకు గతంలో కాకాని ఎంతటి గౌరవం ఇచ్చారో.. ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. అంతక డబల్ ఇస్తానంటూ వెటకారం చేయడాన్ని పలువురు ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అనిల్ వ్యవహార సరళిని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని చెబుతున్నారు.

ఇక.. కాకాని మంత్రి అయ్యాక తొలిసారి నెల్లూరు వచ్చిన సందర్భంగా నిర్వహించిన అభినందన సభ వేదికగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయనరెడ్డి అనిల్ పై పేరు చెప్పకుండా రెచ్చిపోయారు. గడిచిన మూడేళ్లుగా నెల్లూరు జిల్లాలో అభివృద్ధి అనే మాటే లేదన్నారు. జిల్లాకు రావాల్సిన అనేక ప్రయోజనాలు, నిధులు రాలేదని దుయ్యబట్టారు. అనిల్ కుమార్ జిల్లా మంత్రిగా ఉన్నంతకాలం రైతులు, సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మంచి మంత్రి కోసం ఈ మూడేళ్లుగా వేయి కళ్లతో ఎదురు చూసిన వారి ఆశలు కాకాని మంత్రి కావడంతో ఫలించాయని అనడం విశేషం. అనిల్ కుమార్ పై ఆగ్రహాన్ని అగణదొక్కుకుంటూనే ఆనం రామనారాయణరెడ్డి పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించడంతో గ్రూపు రాజకీయాలు ఎంతదాకా వెళ్లాయో అర్థం అవుతోందంటున్నారు.

నిజానికి కాకాని అభినందన సభకు గానీ, మంత్రి అయ్యాక తొలిసారి నెల్లూరు వస్తున్నందున ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ అనిల్ కుమార్, మంత్రి పదవి ఆశించి భంగపాటుకు గురైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాకపోగా.. కాకాని అభినందన సభ జరిగే రోజునే.. అదే సమంయలో కార్యకర్తల అభినందన సభ పేరుతో పోటీ సభనిర్వహించడంతో వారి మధ్య గ్రూపు తగాదాలు ఎంత ముదిరిపోయాయో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి కాకాని అభినందన సభకు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఇక నెల్లూరులో రాజకీయంగా కాక రేపుతున్న ఫ్లెక్సీల రగడపై అనిల్ కుమార్ స్పందించారు. ఫ్లెక్సీల ధ్వంసం వెనుక అనిల్ హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలకు బదులివ్వడం గమనార్హం. నెల్లూరులో ఫ్లెక్సీలు వేయకూడదనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని, తన ఫ్లెక్సీలను కూడా గతంలో వేయనివ్వలేదని గుర్తుచేశారు. ఆ క్రమంలోనే ఇంతకు ముందు దివంగత ఆనం వివేకానందరెడ్డి జయింతి సందర్భంగా వేసిన ఫ్లెక్సీలు కూడా తొలగించిన వైనాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఈ క్రమలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలు కూడా తొలగించడంలో ఆశ్చర్యం ఏముందని ముక్తాయింపు ఇవ్వడం విశేషం.

ఈ గొడవలు ఇలా ఉండగా తాజాగా మంత్రి కాకాని సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో అనిల్ కుమార్ పర్యటించడం కూడా వివాదాస్పదం అయింది. ‘నా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు మిగిలిన ఎమ్మెల్యేలు రావచ్చు.. నేను సర్వేపల్లి వెళ్లకూడదా?’ అని అనిల్ ప్రశ్నించారు. అంటే అనిల్ కావాలనే రెచ్చగొట్టేందుకే సర్వేపల్లి నియోజకవర్గంలో టూర్ చేశారనే విమర్శలు వస్తున్నాయి. మరో పక్కన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా జిల్లా వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలపై మాట్లాడారు. జిల్లా వైసీపీ నేతల్లో ఇంత రచ్చ ఒకవైపున జరుగుతున్నా.. వైసీపీలోని ఎవరితోనూ తనకు భేదాభిప్రాయాలు లేవని చెప్పడం విశేషం.

By
en-us Political News

  
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.