పార్టీపై పట్టు పోయిందా! జగన్ చెప్పినా చల్లారని సెగలు

Publish Date:Oct 18, 2020

Advertisement

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో క్రమశిక్షణ లోపించిందా? వైసీపీ నేతలు హైకమాండ్ ను ఖాతరు చేయడం లేదా? పార్టీపై వైఎస్ జగన్ పట్టు కోల్పోయారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అవి నిజమేనని తేలుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ నాయకులు కుమ్ములాటలకు పాల్పడుతున్నారు. ఏదో ఒక వివాదంతో ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. స్వపక్షంలో విపక్షంలా బాహాబాహీకి దిగుతున్నారు. ఆధిపత్యం చేలాయించేందుకు గ్రూపు తగాదాలకు తెరలేపుతున్నారు. ప్రధానంగా వలస నేతలు, పాత నేతల మధ్య వివాదాలు అగ్గిరాజేస్తున్నాయి. పార్టీ హైకమాండ్ ను నేతలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అధినేత జగన్ చెప్పినా కొందరు నేతలు డోంట్ కేర్ అంటున్నారట. వైసీపీలో జరుగుతున్న పరిమాణాలతో పార్టీపై జగన్ పట్టు కోల్పోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 

 

పౌరుషాల గడ్డ గుంటూరు జిల్లా పల్నాడులోనూ వైసీపీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. తన నియోజకవర్గంలోకి ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయులును అడుగు పెట్టనివ్వకుండా ఎమ్మెల్యే రజనీ, ఆమె అనుచరులు ప్రయత్నించారని సమాచారం. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారివద్దకు ఎంపీ వెళుతున్నారని రజనీ వర్గం ఆరోపిస్తోంది.  ఎమ్మెల్యే విడదల రజనీ అనుచరులు భూసేకరణ సమయంలో రైతుల వద్ద లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారని ఎంపీ లావుఅధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని ఎమ్మెల్యే రజనీ పార్టీ అధిష్టానానికి తెలియచేసారు. తన ఫోన్లను పోలీసులతో కలిసి ఎంపీ ట్యాపింగ్ చేయించారని రజనీ ఆరోపిస్తున్నారు. వివాదం ముదరడంతో ఏం చేయాలో తెలియక వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. జగన్ చెప్పినా ఇద్దరు నేతలు వినడం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు.  

 

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. మూడు వర్గాలు ఆధిపత్యం కోసం  కత్తులు దూస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశి, డీసీసీబీ చైర్మెన్ యార్లగడ్డ మధ్య రాజీకి జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు. కలిసి పనిచేయండని వంశి, వెంకట్రావుల చేతులు కలిపి జగన్ పంపించినా  వారు కలవడానికి ఇష్టపడటం లేదు. జగన్ సమావేశం తర్వాత కూడా వల్లభనేని, యార్లగడ్డలు ఒకరిపై ఒకరు కాలు దువ్వూతూనే ఉన్నారు. తానే వైఎస్సార్‌సీపీకి అసలు నాయకుడినని.. వంశీ అద్దె నాయకుడని యార్లగడ్డ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు.  వంశీతో కలిసి పని చేయనని సీఎం జగన్ కి చెప్పేశానని కూడా చెబుతున్నారట. వంశీ దొంగ ఓట్లతో గెలిచాడని చె యార్లగడ్డ ఆరోపిస్తుండటం.. వల్లభనేని వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పార్టీ సీనియర్‌ నాయకుడు దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే వంశీ వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 

 

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆమంచి, ఎమ్మెల్యే కరణం వర్గాలు బలప్రదర్శనకు దిగుతున్నాయి. రెండు వర్గాల హంగామాతో ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా హై టెన్షన్‌ తలపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమంచే ఎమ్మెల్యేగా హడావుడి చేస్తున్నారని కరణం వర్గీయులు ఆరోపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కరణం అధికారిక కార్యక్రమానికి వెళ్లినా తన వర్గీయులతో నానా యాగీ చేయించేవారని ఆక్రోశిస్తున్నారు. ఇటీవల  ఎమ్మెల్యే కుమారుడు కరణం వెంకటేష్ ఆమంచిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి.  దర్శి నియోజకవర్గ వైసీపీలోనూ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రకాశం జిల్లా నేతల మధ్య సఖ్యతకు జిల్లా మంత్రి ప్రయత్నిస్తున్నా కొలిక్కి రావడం లేదట. 

 

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో రాజకీయం రాజుకుంటుంది. సీనియర్‌ నాయకుడు కోలా గురువులు వర్గంతో పాటు మరో వర్గం  ఉంది. ఇప్పటివరకు ఎమ్మెల్యే వాసుపల్లిని వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు ఆయన వెనక తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఉన్న వైరంతో ఇప్పుడు తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతారనే భయం వారిని వేధిస్తుందట. గతంలో కార్పొరేటర్ల టిక్కెట్ల కోసం  పార్టీలో కుమ్ములాటలు కలకలం రేపాయి.  మరోవైపు ఎమ్మెల్యే కుమారులు కార్పొరేటర్లుగా పోటిచేస్తారన్న ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల కోసం అధికార పార్టీలో కార్పొరేటర్ల మధ్య పోటి పెరుగుతోంది. అంతర్గత కుమ్ములాటలు అగ్గిరాజేస్తున్నాయి. 

 

చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే రోజా మధ్య  విభేదాలు ముదురుతున్నాయి. నగరిలో రోజాకు వ్యతిరేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ ఉన్నారు. అయితే కేజే కుమార్ భార్య కేజే శాంతిని రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ నియమించడం వైసీపీలో కాక రేపుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతోనే కె జె కుటుంబానికి ఈ అవకాశం దక్కినట్లు గా రోజా వర్గం భావిస్తోంది.తనకు చెక్ పెట్టేందుకే తన ప్రత్యర్థి వర్గానికి కీలక పోస్టులను మంత్రి పెద్దిరెడ్డి ఇప్పిస్తున్నారని రోజా ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. పెద్దిరెడ్డితో తాడోపేడో తేల్చుకునేందుకు నగరి ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రోజాకు నచ్చ చెప్పలేక.. అటు సీనియర్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డితో మాట్లాడలేక వైసీపీ ముఖ్య నేతలు ఇబ్బంది పడుతున్నారని  సమాచారం. 

 

సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో హైకమాండ్ సుప్రీంగా ఉంటుంది. కాని  వైసీపీ నేతలు పార్టీ నిర్ణయాలకు భిన్నంగా ప్రవర్తిస్తుండటం చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న క్రమశిక్షణ ఇప్పుడు వైసీపీ సర్కార్‌లో ఎందుకు కనిపించడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. ఏపీలో అధికార పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ లేకుండా పోతోందని,, వారిని గాడిలో పెట్టడంలో జగన్ విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా ఏపీలో వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో పార్టీపై... ముఖ్యమంత్రి జగన్ పట్టు కోల్పోయినట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పార్టీ నేతలను కంట్రోల్ చేసే స్థితిలో జగన్ లేరని చెబుతున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.