వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం.. ఇంతకీ ఎక్కడున్నాడు?

Publish Date:Aug 2, 2024

Advertisement

గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు.

వంశీని అరెస్టు చేయడానికి మూడు పోలీసు బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ పేరు 71వ ముద్దాయిగా ఉంది. ఈ దాడిలో వంశీ నేరుగా పాల్గొనపోయినా దాడికి వైసీపీ కార్యకర్తలను ప్రేరేపించింది వంశీయేనని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం పోలీసులు వంశీ సొంత మనుషుల్లా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆ కారణంగానే  దాడి తరువాత పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. వైసీపీ సర్కార్ పతనమై.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే పోలీసులు కేసును సీరియస్ గా పట్టించుకుంటున్నారు. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో గత నెల 9న పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. వారిలో వంశీకి అత్యంత సన్నిహితులైన బాపులపాడు ఎంపీపీ నగేష్, మరో  ముగ్గురు ఉన్నారు. ఇంకా పలువురు పరారీలో ఉన్నారు. 

అయితే తెలుగుదేశం శ్రేణులు మాత్రం పోలీసులు వంశీ సహా కీలక నిందితులను వదిలేశారని ఆరోపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వంశీ నియోజకర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలను తీవ్రంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా  తమ పార్టీ  కార్యకర్తలు, నాయకులపై పలు అక్రమకేసులు కూడా పెట్టించారని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత వంశీ విజయవాడ వదిలిన కుటుంబంతో సహాక హైదరాబాద్ కు మకాం మార్చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో అడుగు పెట్టింది కూడా లేదు. దీంతో వంశీ కోసం మూడు పోలీసు బృందాలు గురువారం (ఆగస్టు 1) హైదరాబాద్ చేరుకున్నాయి. అయితే పోలీసులు చాలా తాపీగా స్పందించారనీ, వంశీ ఇప్పటికే దేశం దాటేశారన్న వార్తలు వినవస్తున్నాయి. 

పులవర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లే చేసి వదిలివేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో వంశీ అరెస్టు వారిని ఒకింత శాంత పరిచే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై మొట్టమొదట అనుచిత వ్యాఖ్యలు చేసింది వల్లభనేని వంశీయే అన్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో వంశీ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలన్న ఎస్పీ విస్పష్ట ఆదేశాలతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అవసరమైతే లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేయాలని భావిస్తున్నారు. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు. బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజకీయంగా భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.