ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి
Publish Date:Jun 7, 2025
Advertisement
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినందిస్తున్నాని ఆయన అన్నారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు, ధర్మల్ పవర్‌తో పాటు పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ తీసుకోవాలని ఆలోచిస్తున్నామని అందుకోసమే, తెలంగాణ ప్రభుత్వం 2015 న్యూ ఎనర్జీ పాలసీ తెచ్చిందని భట్టి తెలిపారు. తెలంగాణలో 2029-30 నాటికల్లా కనీసం 20 వేల మెగా వాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. దేశ వ్యాప్తంగా పవర్ కన్జంక్షన్,పొల్యూషన్ విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు. పాణ్యం మండలం పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి కరెంట్ ఉత్పత్తికి సిద్దంగా ఉందని, రానున్న రోజుల్లో పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నుంచి వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు.. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించానని భట్టి తెలిపారు. పవర్ స్టోరేజ్ కోసం గ్రీన్ కో ప్రాజెక్టు వాడే టెక్నాలజీ అద్బుతంగా ఉందని, 4 వేల మెగా వాట్స్ సోలార్ పవర్, ఒక వెయ్యి మెగా వాట్స్ విండ్ పవర్, 1680 మెగా వాట్స్ జల విద్యుత్ ఉత్పత్తి చేసి పీక్ అవర్‌లో ఇతర రాష్ట్రాలకు సప్లై చేసేందుకు గ్రీన్ కో ప్రాజెక్టు సంసిద్దంగా ఉందని భట్టి అన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టులు దేశంలో ఇంకా రావాలని, వీటివల్ల దేశ జీడీపీ పెరుగుతుందని భట్టి స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/green-co-energy-project-39-199519.html





