Publish Date:Jul 19, 2022
అధికారంలో వున్నామని కుర్చీలు, బల్లలూ, పరికరాలు వాడినట్టు ప్రభుత్వ లాయర్లను వాడేయచ్చని తెలంగాణా ప్రభుత్వం అనుకుంది. కానీ అదంతా నడవదు.. ప్రభుత్వాధికారులైనంత మాత్రాన ప్రభుత్వ లాయర్లను వినియోగించుకోరాదని హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని మందలించింది. అధికారుల కోర్టు ధిక్కారం కేసుల్లో సొంత ఖర్చులతో న్యాయవాదులను నియమించుకోవాల్సిందేనని మందలించింది. ప్రభుత్వాధి కారుల తరఫున అడ్వకెట్ జనరల్ కార్యాలయానికి చెందిన ప్రభత్వ న్యాయవాదులు హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహించింది.
ఒక కోర్టు ధిక్కరణ కేసులో అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకావడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అధికారుల ధిక్కరణ కేసులకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమిని సేకరించి.. నాలుగేళ్లుగా పరిహారం చెల్లించడం లేదంటూ రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నాగాహిల్స్‌లోని సర్వే నంబర్ 66లో ఉన్న 276 చద రపు గజాల ప్లాట్ విషయంలో ఆ భూమి యజమాని మహమ్మద్ ఖాజం అలీ కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. జీహెచ్ ఎంసీ అధికారులు ఆ భూమి వివాదాస్పదమైనదని చెప్పడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసే కరణ చేసి.. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక.. ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని చెప్ప డాన్ని తప్పు బట్టింది. ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది.
జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న కొవిడ్ కారణంగా విచారణకు హాజరుకాలేక పోయారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల తరఫున ఏజీ కార్యాలయం ప్రాతినిధ్యం వహించ డంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదంలో ఉన్న భూమి గవర్నమెంట్ స్థలమని ప్రభు త్వం తరఫు న్యాయవాది పేర్కొనగా.. అయితే భూసేకరణ ఎందుకు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసులో భూమి టైటిల్‌ను తేల్చడం తమ పనికాదని.. పరిహారం అందిందా? లేదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని స్పష్టంచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/govtadvocates-not-allowed-for-court-contempt-cases-25-140103.html
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.