ధిక్కరణ కేసులకు ప్రభుత్వ న్యాయవాదులా.. కోర్టు ఆగ్రహం
Publish Date:Jul 19, 2022
Advertisement
అధికారంలో వున్నామని కుర్చీలు, బల్లలూ, పరికరాలు వాడినట్టు ప్రభుత్వ లాయర్లను వాడేయచ్చని తెలంగాణా ప్రభుత్వం అనుకుంది. కానీ అదంతా నడవదు.. ప్రభుత్వాధికారులైనంత మాత్రాన ప్రభుత్వ లాయర్లను వినియోగించుకోరాదని హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని మందలించింది. అధికారుల కోర్టు ధిక్కారం కేసుల్లో సొంత ఖర్చులతో న్యాయవాదులను నియమించుకోవాల్సిందేనని మందలించింది. ప్రభుత్వాధి కారుల తరఫున అడ్వకెట్ జనరల్ కార్యాలయానికి చెందిన ప్రభత్వ న్యాయవాదులు హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహించింది. ఒక కోర్టు ధిక్కరణ కేసులో అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాదులు హాజరుకావడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అధికారుల ధిక్కరణ కేసులకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమిని సేకరించి.. నాలుగేళ్లుగా పరిహారం చెల్లించడం లేదంటూ రంగా రెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నాగాహిల్స్‌లోని సర్వే నంబర్ 66లో ఉన్న 276 చద రపు గజాల ప్లాట్ విషయంలో ఆ భూమి యజమాని మహమ్మద్ ఖాజం అలీ కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. జీహెచ్ ఎంసీ అధికారులు ఆ భూమి వివాదాస్పదమైనదని చెప్పడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూసే కరణ చేసి.. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక.. ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అని చెప్ప డాన్ని తప్పు బట్టింది. ఈ అంశంపై జీహెచ్‌ఎంసీ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్‌ను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందా నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది. జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ డిప్యూటీ కమిషనర్ వెంకన్న కొవిడ్ కారణంగా విచారణకు హాజరుకాలేక పోయారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల తరఫున ఏజీ కార్యాలయం ప్రాతినిధ్యం వహించ డంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదంలో ఉన్న భూమి గవర్నమెంట్ స్థలమని ప్రభు త్వం తరఫు న్యాయవాది పేర్కొనగా.. అయితే భూసేకరణ ఎందుకు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు ధిక్కరణ కేసులో భూమి టైటిల్‌ను తేల్చడం తమ పనికాదని.. పరిహారం అందిందా? లేదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలిస్తామని స్పష్టంచేసింది.
http://www.teluguone.com/news/content/govtadvocates-not-allowed-for-court-contempt-cases-25-140103.html