‘దేవుడి’ సన్నిధిలో దైవజ్ఞసమ్మేళం!

Publish Date:Oct 14, 2020

Advertisement

స్వరూపుల వారి సేవలో సర్కారు శాఖ

 

ఆ సాములోరి స్పెషాలిటీ ఏమిటో?

 

ఆయన నడిచే దేవుడు. శంకరాచార్య అంశలో విశాఖలో కళ్లు తెరచిన ఓ మహా తపస్వి. తన కఠోర తపస్సుతో.. ఒక నేతను పాలకుడిగా మార్చిన దైవాంశ సంభూతుడు. మరి అంతటి మహాత్ముడిని సేవించి తరించడం పాలకుల విధి. కర్తవ్యం. బాధ్యత కూడా! పాలకుల సేవిస్తున్నారంటే, భృత్యులు కూడా వారిని అనుసరించాల్సిందే. అందుకేనేమో.. తెలుగడ్డపై ఎంతోమంది పీఠాధిపతులు, వారి ఆశ్రమాలు ఉన్నప్పటికీ, సదరు స్వామి వారి పీఠంలోనే సర్కారీ శాఖ అధికార కార్యక్రమం నిర్వహించి తరించిపోయింది.

 

అసలు కథేమిటంటే.. సర్కారు ఏలుబడిలోని దేవదాయ ధర్మదాయ శాఖ కొద్దిరోజుల క్రితం,  ‘జగన్గురు’వయిన.. జగద్గురు స్వరూపానంద స్వామి వారి విశాఖ చినముషిడివాడ శారదాపీఠంలో ‘దైవజ్ఞ సమ్మేళం’ జరిగింది. దీనిని రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ నిర్వహించింది. దీనికి దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్,  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరక్టర్ కృష్ణశర్మ, దేవాలయ పాలనా సంస్థ డైరక్టర్ ద్రోణంరాజు రామచంద్రరావు హాజరయ్యారు. సరే..  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరక్టర్ కృష్ణశర్మ అంటే పూర్వాశ్రమంలో.. ఆ ఆశ్రమంలో అర్చక స్వామి కాబట్టి.. సాములోరి  సన్నిధిలో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహిద్దామన్న ఆలోచన ఉండవచ్చు. తప్పులేదు. తనకు పదవి ఇప్పించినందుకు ఆపాటి కృతజ్ఞత, గురుభక్తి ప్రదర్శించడంలో ఆక్షేపణ ఏమీ కాదు. అది వేరే విషయం.

 

ఈ సందర్భంగా స్వామివారు పంచాంగాలపై పంచాయతీలు వద్దని, పండుగలు నిర్ణయించే అంశంలో పంచాంగ కర్తలంతా.. ఏకాభిప్రాయానికి రావాలని హితవు పలికారు. అంతవరకూ బాగానే ఉంది. పండుగల తేదీపై పండితుల మధ్య, చాలా ఏళ్ల నుంచి పంచాయతీ నడుస్తోంది. కాబట్టి స్వామి వారి హితోక్తులు వారిపై ప్రభావం చూపిస్తే, ఇకపై పండితులంతా స్వామి వారు సెలవిచ్చినట్లు.. ఒకే తేదీ ప్రకటిస్తారని ఆశించడంలో తప్పులేదు.

కానీ..  రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడెమీ వారు,  విశాఖలోని ‘జగన్గురువు’ గారి పీఠంలోనే ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహించాలన్న ప్రశ్నలు,  కొత్తగా తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలో చాలామంది పీఠాథిపతులున్నారు. ఆశ్రమాలూ ఉన్నాయి. కానీ, సర్కారు వారు కేవలం స్వరూపానందుల వారి ఆశ్రమంలోనే, ఈ  దైవజ్ఞసమ్మేళం నిర్వహించారన్న ప్రశ్నలు హిందూ సంస్థల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రమోషన్ వ్యవహారాల వల్ల.. ఎవరి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. దేవదాయ శాఖ ఉన్నతాధికారులకంటే, సర్కారు వారి సేవలో తరించక తప్పదు. కానీ, ఒక ప్రైవేటు పీఠాథిపతి పీఠంలోనే అధికారిక కార్యక్రమం నిర్వహించి, స్వామి వారి సేవలోనూ తరించడం ఏమిటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

ఇప్పటికే స్వామి వారి పీఠం ముందున్న.. పోలీసు పోస్టు, బుగ్గకారు, సెక్యూరిటీ వాతావరణం చూస్తే, అదేదో ఒక మంత్రి గారి బంగ్లా వాతావరణం దర్శనమిస్తుంది. ఇప్పుడిక సర్కారీ శాఖలు కూడా అక్కడికే తరలివెళితే.. ఇక దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే పెడితే నిక్షేపంలా ఉంటుందన్నది కొందరి వ్యాఖ్య. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఏ దేవదాయ కమిషనరు కూడా ఇప్పటివరకూ ఒక పీఠంలో అధికార కార్యక్రమాలు నిర్వహించడం గానీ, కార్యక్రమాల రూపకల్పన, నిర్ణయాలలో ఏ ఒక్క పీఠాధిపతి ఆశ్రమానికి అధికారులు వెళ్లి వారి అనుమతి తీసుకున్న దాఖలాలు, చరిత్ర ఎన్నడూ లేదు. ఎలాగూ ఆ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు కాబట్టి, ఆ కార్యాలయాలేవో పీఠంలోనే ప్రతిష్ఠిస్తే అధికారులకు సమయం, ఇంధన ఖర్చులూ మిగిలిపోతాయి కదా అన్నది బుద్ధిజీవుల ఆలోచన.

 

ఎలాగూ విశాఖకు రాజధానిని తరలిస్తున్నందన, కమిషనర్, జేసీ, ఏసీల కార్యాలయాల వరకూ పీఠంలోనే పెడితే.. వారికి దిశానిర్దేశం ఇచ్చేందుకు, స్వామి వారికి కూడా కొంత సౌకర్యంగానే ఉంటుంది కదా? ఏమంటారు? పాలకులు ఈ దిశగా ఆలోచిస్తే, ఒక్క ఎండోమెంటు శాఖ మాత్రమే కాకుండా.. అనంతకోటి  భక్తుల జన్మలు కూడా చరితార్ధమవుతాయి. ఓసారి ఆలోచించి చూద్దురూ?!

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.