అశోక్ గజపతిరాజుకు అభినందనలు చెప్పిన సీఎం చంద్రబాబు
Publish Date:Jul 14, 2025
Advertisement
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గోవా గవర్నర్ గా నియమితులైన పి.అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఏపీ ప్రజలకు ఇది గర్వకారణం. అశోక్ గజపతిరాజుకు ఇంతటి గౌరవనీయ పదవిని ఇచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి వర్గంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విశిష్ట పదవిలో అశోక్ గజపతిరాజు విజయవంతం అవ్వాలని, పదవీకాలాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. హరియాణా గవర్నర్‌గా ప్రొఫెసర్ ఆషిమ్‌కుమార్ ఘోష్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హరియాణా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగిసింది. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. గ్వాలియర్‌లోని సింధియా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో ఆయన చదువుకున్నారు. పుట్టింది రాజవంశంలోనే అయినా సామ్యవాద భావాలను ఆయన చిన్నప్పటి నుంచే పుణికి పుచ్చుకున్నారు. విద్యార్థి దశలో కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆయన ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రానికి తెరతీశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకూ మొత్తం 20 మంది వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేశారు. అలాగే ఒడిశా, తమళినాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరితోపాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు. అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్నారు
http://www.teluguone.com/news/content/governor-of-goa-39-201973.html





