అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

Publish Date:Jan 20, 2026

Advertisement

తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వాకౌట్ చేశారు. ఔను తమిళనాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ మధ్యలోనే వాకౌట్ చేశారు. ఈ విషయమై లోక్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో దేశంలోని అన్ని శాసన సభలలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం సంప్రదాయంగా కొనసాగుతోందనీ, కానీ  స్టాలిన్ సర్కారు మాత్రం ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసిందనీ,  దీనికి నిరసనగా గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినట్లు  పేర్కొంది. 

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సభలో జాతీయ గీతాన్ని పాడకుండా ప్రభుత్వం అవమా నించిందని లోక్ భవన్ విమర్శించింది.  అసెంబ్లీలో తరచూ జాతీయగీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్‌ సభలో నుంచి వెళ్లిపోయారని తెలిపింది.

 ఇలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ తీరును తప్పుపట్టారు. సభను ఉద్దేశించి ప్రసంగించకుండా వాకౌట్ చేయడం ద్వారా గవర్నర్ రవి సభా సాంప్రదాయాన్ని, నైతికతను  ఉల్లంఘించారని విమర్శించారు. ప్రభుత్వం రూపొందించే ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలను చేర్చాలన్న నిబంధన ఎక్కడా లేదన్న స్టాలిన్, గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి ఉద్దేశపూర్వకంగానే సభను అవమానించడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం ఎం.కే.స్టాలిన్ మండిపడ్డారు. మొత్తం మీద అసెంబ్లీ నుంచి  గవర్నర్ వాకౌట్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా పెను వివాదంగా కూడా మారింది. 

By
en-us Political News

  
బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌తో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డూ వ్యవహారంలో వైసీపీ తీరును, జగన్ చేస్తున్న వాదనను నిలదీశారు. తిప్పికొట్టారు. శషబిషలకు తావులేకుండా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ వంద శాతం తేల్చిందని కుండబద్దలు కొట్టేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిలు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో వారు తెలంగాణ మునిసిపోల్స్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి కోరిక మన్నించి తెలంగాణ మునిసిపోల్స్ లో కమలం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పవన్ అంగీకరించారు.
పరామర్శయాత్ర పేర ఆయన చేసిన ర్యాలీ గొల్లపూడి నుంచి ఇబ్రహీపట్నం చేరే లోపే రాంబాబు, భార్గవ్ అనే ఇద్దరు వైపీపీ కార్యర్తలు ప్రాణాలు కోల్పోయారన్నారు.
సింథ‌టిక్ నెయ్యితో స్వామివారికి ల‌డ్డూలు చేసి పెట్టిన పాపం ఊర‌కే పోలేదనీ, ఇప్పటికే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొందనీ అంటున్నారు. ఇక రోజా విషయానికి వస్తే.. ఆమెకు తిరుమల వెంకటేశ్వరస్వామిపై ఎంత భక్తి ఉందో.. అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిపైనా అంత భక్తి ఉంది. తరచూ ఆమె తిరుమల వెంకన్న స్వామివారిని, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారినీ దర్శించుకుంటూ ఉంటారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బూత్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో మంత్రి నారా లోకేష్ కీలక దిశానిర్దేశం చేశారు.
అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
కొంత కాలం గడిచిన తర్వాత తన బలం ఏంటో అందరికీ అర్థమవుతుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజలే తనను నాయకురాలిగా తీర్చిదిద్దాలని, వారి మద్దతే తనకు అసలైన బలమని పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట అంటే బుధవారం ఆయన అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ పేరుతో గుంటూరులో పర్యటించి పరామర్శ చేసిన సంరద్భంగా పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బహుశా జగన్ పోలీసు ఆంక్షలకు తలొగ్గి శుక్రవారం తన ఇబ్రహీంపట్నం పర్యటనలో ‘రూటు’ మార్చారు. అంటే ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా పోలీసులు చెప్పినట్లుగా వారు సూచించిన దారిలో వెళ్లారు.
వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు ఇలాంటి పనులే చేసి జోగి రమేష్ మంత్రిపదవి పొందారు. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు జగన్ కు అత్యంత నమ్మకస్తులుగా మారారు. తెలుగుదేశం నుంచి వలస వచ్చిన వల్లభనేని వంశీ జగన్ కు అస్మదీయుడయ్యారు.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు జట్టుకు రంగు వేయించుకోకపోవడానికి జగన్ కు నలుపు రంగు అంటే ఇష్టం లేకపోవడమే కారణమని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు కూడా జుత్తుకు రంగు వేసుకోవడం లేదనుకోండి.. జగన్ కు అప్పుడు ఇష్టం లేని నల్ల రంగు ఇప్పుడు ఎందుకు ఇష్టం అవుతుందన్న అభిప్రాయం కావచ్చు.
తెలుగువన్ వాస్తవ వేదిక పదకొండవ సంచికలో ఘాటైన చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.