త‌మిళిసై పీఆర్వోగా బీజేపీ లీడ‌ర్‌!.. గ‌వర్న‌ర్ తీరుపై గ‌రంగ‌రం!

Publish Date:Apr 23, 2022

Advertisement

తెలంగాణ గవర్నర్ తమిళిసై చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయా? లేక ఆమె స్వయంగా వివాదాలను ఆహ్వానిస్తున్నారా తెలియడం లేదని పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె  తాను వివాదాస్పదురాలిని కాననీ పదే పదే చెప్పుకుంటున్నా...ఒక దాని తరువాత ఒకటిగా వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆమె పీఆర్వోను నియమించుకున్న ఉదంతం మరో వివాదంగా మారింది. ఆమె తన పీఆర్వోగా నియమించుకున్న వ్యక్తి తమిళనాడు బీజేపీ పీఆర్వో కావడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై తన ప్రజా సంబంధాల అధికారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. సదరు వ్యక్తి  తమిళనాడు బీజేపీకి పీఆర్వ్వోగా వ్యవహరిస్తున్నారు. 
దీంతో  ఇప్పటికే తమిళిసై పై, ఆమె వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న తెరాస విమర్శలపర్వానికి తెర తీశారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాక్, రాష్ట్రంలో తల్లీ కుమారుడి ఆత్మహత్య వంటి అంశాలపై ఆమె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసి వ్యాఖ్యలతో అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వం- రాజ్ భవన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో తమిళిసై పీఆర్వో వ్యవహారం వెలుగులోకి రావడంతో విమర్శలకు  తెరాసకుపదునైన ఆయుధం దొరికినట్లైంది. 
సాంకేతికంగా గవర్నర్ తమిళిసై పీఆర్వో బీజేపీకి చెందిన వ్యక్తి అవ్వడం నిబంధనలకు వ్యతిరేకం కాకపోయినప్పటికీ, నైతికంగా పార్టీలతో సంబంధం లేని వ్యక్తిని అటువంటి విధులలో చేర్చుకోవడం విధాయకమని పరిశీలకులు అంటున్నారు. అయితే తెరాసతో గవర్నర్ సంబంధాలు ఉప్పు-నిప్పుగా మారిన తరుణంలో తమిళిసై సహజంగానే సాంకేతిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.  రాష్ట్రంలో శాంతి భద్రతల అశం నుంచి....మెడికల్ సీట్ల కేటాయింపు వరకూ, నియామకాల నుంచి నీటి వరకూ ప్రతి అంశంపైనా ఆరా తీస్తున్నారు. ప్రతి అంశంపైనా తనదైన శైలలో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆ అభిప్రాయాలన్నీ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిగానే ఉంటున్నాయి.
త్వరలోనే రాష్ట్ర గవర్నర్ మార్పు ఉంటుందన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ వార్తలు ప్రచారంలోనికి వచ్చిన తరువాత తమిళిసై తన దూకుడును మరింత పెంచారు. రానున్న రోజులలో తమిళిసై పీఆర్వో అంశం మరింతగా రాజ్ భవన్- ప్రభుత్వం మధ్యా దూరం పెంచేందుకు దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.

By
en-us Political News

  
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.