ఆర్టీసీ విలీనం.. బీజేపీకి సంకటం!

Publish Date:Aug 5, 2023

Advertisement

ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఆదే అని ఇప్పుడు బీజేపీ వాపోతోంది. ఇటీవలి కాలంలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తరువాయి అన్న స్టేజి నుంచి ఇప్పుడు ఉనికి కాపాడుకుంటే చాలనుకునే స్థితికి దిగజారిందని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.

కర్నాటక ఫలితాల తరువాత తెలంగాణలో బీజేపీది బలం కాదు వాపు అన్న సంగతి, ఆ పార్టీ నేతల ప్రకటనలలోని డొల్ల తనం ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. అన్నిటికీ మించి బీజేపీ, బీఆర్ ఎస్ ల మధ్య రహస్య సంబంధాలున్నాయన్న విమర్శలకు బలం చేకూరింది. అదే సమయంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని బీఆర్ఎస్ కు దీటుగా నిలబడే స్థాయికి ఎదిగింది. పార్టీలో విభేదాలు సమసిపోయి సమష్టిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక  కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ  తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ తమిళిసై లేవనెత్తిన సందేహాల కారణంగా కార్మికుల్లో వ్యక్తమౌతున్న ఆందోళన బీజేపీకి శరాఘాతంగా మారిందనే చెప్పాలి.

ఆర్టీసీ విలీనం బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం కాకపోవడం వెనుక ఉన్నది బీజేపీయే అన్న ఆగ్రహం కార్మికుల్లో వ్యక్తం అవుతోంది.  కేసీఆర్ ఆర్టీసీ విలీనం నిర్ణయాన్ని కేబినెట్ లో ఆమోదించి.. వెంటనే బిల్లు రూపొందించేసి గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. మంగళవారం గవర్నర్ ఆమోదానికి పంపించి వెంటనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టేయాలన్న ఆత్రత, ఉత్సాహం కనబరిచారు.  అయితే ఆ బిల్లుకు సంబంధించి కొన్ని కొర్రీలు చూపుతూ గవర్నర్ దానిని వెనక్కు పంపారు. దీంతో బిల్లు ప్రభుత్వం కోర్టులోకి వచ్చింది. బిల్లుకు సంబంధించి గవర్నర్ లేవనెత్తిన సమాధానాలన్నిటికీ సమాధానాలిస్తూ మళ్లీ గవర్నర్ కు పంపించినా ఆమె ఔట్ ఆఫ్ హైదరాబాద్ కావడంతో  దానిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి వెంటనే ఆమోదం పొందే అవకాశం లేకపోయింది.

ఇది కచ్చితంగా కేసీఆర్ సర్కార్ ను ఇరకాటంలో పడేస్తుంది. దీంతో దీనికీ రాజకీయ రంగు పులిమి కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ కార్మికుల ఆగ్రహాన్ని గవర్నర్ పైకి మళ్లించే ప్రయత్నం చేసింది.  గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారంటూ బీఆర్ఎస్ నేతలు, మంత్రులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీయే ఆర్టీసీ కార్మికులకు మేలు చేయకుండా అడ్డు పడుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు మొదలెట్టేశారు.

దీంతో గవర్నర్ బిల్లును వెనక్కు పంపిస్తూ తీసుకున్న నిర్ణయం బీజేపీని డిఫెన్స్ లో పడేసింది.  హడావుడిగా బిల్లు రూపొందించి గవర్నర్ కు పంపడమేమిటని బీజేపీ గట్టిగా బీఆర్ఎస్ సర్కార్ ను నిలదీయలేని పరిస్థితుల్లో పడింది.  ఆర్టీసీ బిల్లు లో ఏదో ఓ లొసుగు పెట్టి కేసీఆర్.. విలీనాన్ని ఆలస్యం చేస్తున్నదన్న విషయాన్ని కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో పడ్డారు. అదే సమయంలో ఆర్టీసీ విలీనం జాప్యం కావడానికి బీజేపీయే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది.  

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.