ఇండియాలో గూగుల్, ఫేస్ బుక్ ఓకే..  ట్విటర్‌ పై సస్పెన్స్? 

Publish Date:May 26, 2021

Advertisement

భారత్ లో గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ పై బ్యాన్ పడనుందా? కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఇదే చర్చ. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు చివరి రోజు వరకు స్పందించకపోవడంతో... ఆ రెండు సంస్థలపై నిషేదం విధిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా సస్పెన్స్ వీడిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఐటీ మార్గదర్శకాలను పాటించడానికి సోషల్ మీడియా సంస్థలు ఫేస్‌బుక్‌, గూగుల్‌లు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఈ నిబంధనలు అమలు దిశగా తమ కసరత్తు ఆరంభించామని పేర్కొన్నాయి. దీంతో ఆ రెండు సంస్థలకు ఇండియాలో లైన్ క్లియరైంది. 

భారత దేశంలో బుధవారం (మే 26) నుంచి కొత్త నిబంధనలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాయి. సోషల్ మీడియాపై భారత ప్రభుత్వం విధించిన నిబంధనలను అమలు చేయడమే తమ లక్ష్యమని ఫేస్‌బుక్‌ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ఐటీ మార్గదర్శకాలు అమలు ప్రక్రియపై కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలు గురించి ఫేస్‌బుక్‌ వివరించలేదు. ‘‘మార్గదర్శకాలను అమలు చేసే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నాం. మా సామర్థ్యాలను మెరుగు పర్చుకుంటాం. అయితే... కొన్ని అంశాలపై మరింత స్పష్టత కోసం భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తాం. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ భావాలు వ్యక్తంజేసుకునే వేదికగా నిలిచేందుకు మేం కట్టుబడి ఉంటాం’’ అని ఫేస్‌బుక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

అటు గూగుల్‌ కూడా ఈ నిబంధనలపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సంస్థ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నాం.. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి... ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ.. వనరులను, సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తున్నాం’’ అని తెలిపింది. కేంద్రంతో తరచూ వివాదాలను ఎదుర్కొంటున్న ట్విటర్‌ మాత్రం ఇంకా ఎలాంటి స్పందన తెలపలేదు. ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘కూ’ గతవారమే తాము భారత ప్రభుత్వం విధించిన నిబంధనలన్నీ పాటించే వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ‘కూ’కు 60 లక్షల మంది వినియోగదారులున్నారు. 

సోషల్ మీడియా, ఓటీటీ వేదికల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నియమ నిబంధనలు వెలువరించింది. అప్పటి నుంచే ఇవి అమల్లోకి వచ్చినా ట్విట్టర్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, కూ వంటి దిగ్గజ సంస్థలకు మూడు నెలల సమయం ఇవ్వగా.. గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో ఈ సంస్థలన్నీ కొత్త నిబంధనలను తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాటికి రక్షణ కవచంగా ఉన్న ‘మధ్యవర్తి హోదా’ రద్దవుతుంది.

సామాజిక మాధ్యమాలు, న్యూస్ వెబ్‌సైట్లు, ఓటీటీ వేదికలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం... దేశంలో వీటి పేరు, చిరునామా, అధికారుల వివరాలు స్పష్టంగా తెలియజేయాలి. ఫేస్‌బుక్‌లో ఎవరైనా అభ్యంతరకరమైన పోస్ట్ పెడితే వారిపై క్రిమినల్‌ లేదా ఇతరత్రా చర్యలకు ఆస్కారం ఉండేది. ఫేస్‌బుక్‌కు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ  కొత్త నిబంధనల్లో ఆ వెసులుబాటు తొలగించారు. క్రిమినల్‌ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది.ఈ నిబంధనల అమలును ఏడాదిపాటు వాయిదా వేయాలని దేశీయ, అంతర్జాతీయ సంస్థలు కోరినా కేంద్రం మాత్రం స్పందించలేదు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.