గురువంటే గూగులే.. ఉపాధ్యాయులు ఎందుకు.. విద్యాశాఖ మాజీ మంత్రి పాండిత్యం!

Publish Date:Sep 7, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్.. సెప్టెంబర్ 5వ తేదీన ఒంగోలులో నిర్వహించిన గురుపూజోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. ఈ సందర్బంగా ఆయన  బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్‌ల్లో వచ్చిందని.. గురువులు బదులు ఇప్పుడు గూగుల్ వచ్చిందన్నారు. గురువులకు తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందని చెప్పారు. ఇంకా కాస్త ముందుకెళ్లి గూగుల్ వచ్చిన తర్వాత గురువుల అవసరం లేదంటూ మంత్రి సురేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువుల్లో కంటే గూగుల్‌లో మెటిరియల్ ఎక్కువగా లభిస్తుందంటూ ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలు అటు మీడియలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్  అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యాలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. మంత్రి సురేశ్ వ్యాఖ్యలు అర్థరహితం.. అసంబద్దమని వారు  కొట్టిపారేస్తున్నారు. అసలు ఆయన గురుపూజోత్సవ కార్యక్రమంలో గురువులను సన్మానించారో? లేక అవమనించారో? ముందుగా ఆయన తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ప్రపంచంలో ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం ఇంతవరకు ఎక్కడా ఏదీ లేదని వారు వివరిస్తున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం గురువులతో బోధనలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని మంత్రిగారు గమనించాలంటూ.. ఉపాద్యాయ సంఘాల నేతలు మంత్రిగారికి హితవు పలుకుతున్నారు. 

మరోవైపు మంత్రి సురేశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పదవి వెలగబెట్టారని.. ఆ సమయంలో ఈ మంత్రి పుంగవులకి గురువు కంటే గూగుల్‌లోనే ఎక్కువ మెటిరియల్ దొరుకుతుందని తెలిసి ఉంటుందని  చురకలంటిస్తున్నారు. అయినా పెద్ద చదువులు చదువుకొని.... సెంట్రల్ సర్వీస్‌లో ఉద్యోగం చేసిన సురేష్   గురువుకి గూగుల్‌కి మధ్య తేడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే.. ఆయన జ్ణానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనంటున్నారు.   

జగన్ తొలి కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా.. జగన్ మలి కేబినెట్‌లో మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రిగా ఉన్నఆదిమూలపు సురేష్ కు గురు పూజోత్సవంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో  తెలియనంత అజ్ణానం గూడుకట్టుకుందని అంటున్నారు.

అయినా జగన్ తొలి, మలి కేబినెట్‌లో మంత్రి పదవులు తారుమారు అయినా.. బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌లు ఇద్దరు ఇద్దరేనని.. వీరిరువురూ కూడా సింగిల్ పీస్  డైమండ్ లనీ నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి  జగన్‌కి ఇలాంటి వాళ్లే కావాలని.. అందుకే వీరిద్దరు.. జగన్ తొలి, మలి కేబినెట్‌లలో  కొనసాగుతున్నారని అంటున్నారు. 

అదీకాక...  మన పెద్దలు గురు బ్రహ్మ, గురు విష్ణు, 
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ 
తస్మై శ్రీ గురువే నమ: అని అన్నారని.. 

కానీ అదే మీరైతే.. గూగుల్ బ్రహ్మ, గూగుల్ విష్ణు,
గూగుల్ దేవో మహేశ్వరహ
గూగుల్ సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గూగులే నమ: అని అన్నా అంటారని నెటిజన్లు..  మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తమదైన శైలిలో చురకలంటిస్తున్నారు. 

ఇక మాతృదేవో భవ.. పితృ దేవో భవ.. ఆచార్య దేవో భవ అని మన పూర్వికులు అన్నారని.. అదే మీరైతే.. ఆచార్య దేవో భవాకు బదులు గూగుల్ దేవో అన్న అనగల   సమర్థులని నెటిజన్లు ఆదిమూలపు సురేష్ ను ఓ ఆటాడుకుంటున్నారు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.