ఏపీకి ఇక మంచి రోజులు.. మోడీతో భేటీ అనంతరం పవన్ వ్యాఖ్యల ఆంతర్యమిదేనా?

Publish Date:Nov 11, 2022

Advertisement

‘ఏపీకి ఇక మంచి రోజులు వస్తాయి’ ప్రధాని మోడీతో భేటీ అనంతరం మీడియాతో జనసేనాని పవన్ కల్యాణ్ అన్న మాట ఇది. చాలా కాలం తరువాత జనసేనాని ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు విశాఖ వచ్చి పవన్ మోడీతో భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి వీరిరువురి మధ్యా జరిగిన భేటీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

దాదాపు 35 నిముషాలు జరిగిన ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఏపీకి మంచి రోజులు రానున్నాయని చెప్పారు. ఆ మాటలే ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీలు కలిసి పని చేయడంపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని అంటున్నారు.దాదాపు ఎనిమిదేళ్ల తరువాత పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు ఏపీలోని పరిస్థితులన్నీ ప్రధాని మోదీకి వివరించినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఏపీ   ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన భేటీగా పవన్ అభవర్ణించారు.

ప్రధానితో భేటీ అనంతరం ఏపీకి మంచి రోజులు రానున్నాయన్న విశ్వాసం పెరిగిందన్నారు. పవన్ కల్యాణ్ తో భేటీకి మోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనడానికి తొలుత బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో జరగాల్సిన భేటీని వాయిదా వేసి మరీ ముందుగా పవన్ తో ఆయన భేటీ అవ్వడమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ భేటీ తరువాత పవన్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై పరిశీలకులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మార్పునకు సంకేతమని విశ్లేషిస్తున్నారు. పొత్తుపొడుపులపై మరో మారు ఈ భేటీ చర్చలకు తెరలేపింది. తెలుగుదేశం, జనసేనల మధ్య ఇటీవలి కాలంలో కనిపిస్తున్న సఖ్యత, బీజేపీతో జనసేనకు ఇటీవల పెరిగన దూరం వీటన్నిటినీ వివరిస్తూ 2014 నాటి పరిస్థితులు మళ్లీ రాష్ట్రంలో ఏర్పడనున్నాయని అంటున్నారు.

ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి నడిచే అవకాశాలు మెరుగయ్యాయనడానికి మోడీతో జరిగిన భేటీ అనంతరం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంకేతంగా విశ్వేషణలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ముచ్చటగా మూడేళ్ళుగా సాగుతున్న హనీమూన్ ముగింపుకు చేరుకున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని గతంలోనే విశ్లేషకులు పేర్కొన్నారు. మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంటోంది.

ఈ అన్నిటినీ మించి ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవం అవసరమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు.ఈ నేపధ్యంలో, రాష్ట్రంలో   రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని రాజకీయ పరిశీలకులు గతంలోనే విశ్లేషణలు చేశారు.అలాగే,  బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, చంద్రబాబు ‘విజన్’ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నిర్ణయానికి వచ్చిందని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ మోడీ భేటీ తరువాత జనసేనాని ‘మంచి రోజుల’ వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకోవాలంటున్నారు.  

By
en-us Political News

  
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.