సామర్ల కోటకు చెందిన గోలి శ్యామల కేవలం గృహిణి మాత్రమే . కనీసం స్విమ్మర్ కూడా కాని ఆమె విశాఖ ఆర్ కె బీచ్ నుంచి కాకినాడ తీరం వరకు ఈది సంచలనం సృష్టించారు. దాదాపు 150 కిలోమీటర్లు ఐదురోజుల్లో ఈది అరుదైన రికార్డు సాధించారు. రోజుకు 30 కిలోమీటర్లు టార్గెట్ గా ఆమె ఈత కొట్టారు. సముద్ర కెరటాల మీద ఈత కొట్టడం అంత ఆషామాషీ కాదు. హైద్రాబాద్ లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు ఆమె పని చేశారు. దురదృష్ట వశాత్తు బాగా నష్టపోయారు. ఆర్థికంగా పూర్తిగా చితికి పోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. మైండ్ డైవెర్షన్ కోసం స్విమ్మింగ్ నేర్చుకుని అదే స్విమ్మింగ్ మీద అరుదైన రికార్డు చేరుకోవడం గమనార్హం.
డిప్రెషన్ లో ఉన్నప్పుడు కోచ్ జాన్ సిద్దిఖీ ఆమెకు స్విమ్మింగ్ నేర్పించాడు. జీరో లెవెల్ నుంచి కెరీర్ ప్రారంభించి 150 కిలో మీటర్లు సముద్రంలో చేరుకోవడం ఆసియా స్థాయిలో సాధించిన ఘనత అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 28 కి ముందు వాతావరణం అనుకూలించక ఈ సాహస యాత్రను రెండు పర్యాయాలు వాయిదా వేసుకున్నారు. తర్వాత వాతావరణం అనుకూలించడంతో విశాఖ ఆర్కే బీచ్ లో సముద్రంలో దూకి కాకినాడ గడ్డపై తేలారు.
2021లో ఆమె శ్రీలంక నుంచి ఇండియావరకు రామసేతు దాటానని గోలి శ్యామల చెప్పారు. ఈ యేడు ఫిబ్రవరిలో లక్ష్య ద్వీప్ లో 18 గంటలపాటు 48 కిలో మీటర్లు ఆమె స్విమ్ చేసారు.
బంగాళా ఖాతంలో స్విమ్ చేయాలని ఆమె రెండేళ్ల క్రితమే కలలు కని సాకారం చేశారు. ఒక ఫిషింగ్ బోట్ లో ఇద్దరు స్కూపర్ డ్రైవర్లతో ఈ సాహస యాత్ర చేశారు.
మహిళలకు ఈత కంపల్సరీ అని గోలిశ్యామల చెబుతున్నారు. గైనిక్ సమస్యలను బాధపడుతున్న వారికి ఈత చక్కటి ఉపశమనం అని ఆమె చెబుతున్నారు. స్విమ్ ను స్పోర్ట్స్ గా కాకుండా సర్వైకల్ స్పోర్ట్స్ గా బలంగా నమ్మే గోలి శ్యామల భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు.
గోలి శ్యామల ఈత నేర్చుకునే సమయంలో చాలామంది హేళన చేశారు. అయినా ఆమె పట్టించుకోలేదు. అపజయం నుంచి విజయం అందుకున్న వీర వనిత గోలి శ్యామల.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/goli-shyamala-adventure-in-nadi-sandra-at-the-age-of-fifteen-25-190810.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.