గోల్డ్ ఫిష్.. అమ్మ బాబోయ్ ఎంత బరువో?
Publish Date:Nov 22, 2022
Advertisement
బంగారు వర్ణంతో మెరిసిపోయే గోల్డ్ ఫిష్ అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. ఇంట్లో ఆక్వేరియం ఉందంటే అందులో గోల్డ్ ఫిష్ ఉండి తీరాల్సిందే. అక్వేరియంలో బుల్లి బుల్లి గోల్డ్ ఫిష్ లు అలా అలా కదులుతూ ఉంటే.. ప్రపంచాన్ని మరచిపోయి అలా చూస్తుండి పోతారెవరైనా. ఇళ్లల్లో ఆక్వేరియంలో ఉండే గోల్డ్ ఫిష్ లను ఎంత పౌష్టికాహారం ఇచ్చి పెంచినా వాటి బరువు మహా ఉంటే ఓ కేజీ కేజిన్నర వరకూ పెరుగుతుందేమో. అలా కాకుండా చెరువుల్లోనూ గోల్డ్ ఫిష్ లు పెంచుతుంటారు వాటి బరువు మహా పెరిగితే ఓ మూడు కేజీల బరువు పెరుగుతాయంతే. కానీ బ్రిటన్ లో మాత్రం ఓ వ్యక్తికి ఏకంగా 31కిలోల బరువున్న గోల్డ్ ఫిష్ దొరికింది. ఫ్రాన్స్‌లోని చాంపేన్‌లో ఉన్న బ్లూవాటర్ సరస్సులో ఆండీ వలకు ఈ చేప చిక్కింది. లెదర్ కార్ప్, కోయి కార్ప్ కు చెందిన హైబ్రిడ్ రకమే ఈ భారీ చేప. బ్రిటీష్ మత్స్యకారుడు ఆండీ హాకెట్ వలకు చిక్కిన ఈ గోల్డ్ ఫిష్ ప్రపంచంతోనే అత్యంత బరువైన గోల్డ్‌ఫిష్ గా రికార్డైంది. గతంలో అమెరికాలోని మిన్నసొట్టాలో దొరికిన గోల్డ్ ఫిష్ రికార్డును ఈ చేప చెరిపేసింది. ద క్యారెట్ అని ఈ గోల్డ్ ఫిష్ కుపేరు పెట్టారు.
http://www.teluguone.com/news/content/gold-fish-with-record-weight-caught-by-a-british-fisherman-25-147513.html





