పుష్కర ఘటనలు పునరావృతం జాగ్రత్త పడవచ్చు

Publish Date:Jul 14, 2015

Advertisement

 

ఈ మహా పుష్కరాల గురించి ప్రభుత్వాలు, మీడియా చేసిన అతి ప్రచారం వలననే ఊహించిన దాని కంటే చాలా భార్గీ ప్రజలు తరలివస్తున్నారని చెప్పవచ్చును. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఊహించని స్థాయిలో లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలను నియంత్రించడం అధికారుల వలన కాలేదు. అందుకే ఈరోజు ఈ దుర్ఘటన జరిగిందని చెప్పవచ్చును. నిజానికి ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 27 ఘాట్స్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలను వాటి వైపు మళ్ళించకుండా రాజమండ్రిలోకి అనుమతించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెప్పవచ్చును.

 

పుష్కరాలలో మొదటి రోజయిన మంగళవారంనాడు రాజమండ్రిలో ఇసుకవేస్తే రాలనంత జనం కనిపిస్తే, అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద చాలా పలచగా జనం కనిపించారు. నది తీరం అంతా ఖాళీగా కనబడింది. రెండు జిల్లాలలో ఖాళీగా ఉన్న అటువంటి ఘాట్స్ ఇంకా చాలానే ఉన్నాయి. అధికారులు ముందు నుండే ప్రజలను వాటి వైపు మరలించే విధంగా ప్రణాళికలు, ఏర్పాట్లు చేసుకొని ఉండి ఉంటే ఈ దుర్ఘటన జరిగేదే కాదేమో?

 

కనుక ఇకనయినా ప్రభుత్వం ఏఏ ఘాట్స్ వద్ద ఖాళీ ఉంది? ఇంచుమించుగా అక్కడ ఎంతమంది స్నానాలు చేస్తున్నారు? అక్కడికి చేరుకోవడానికి దగ్గర మార్గం ఏది? అక్కడికి చేరుకోవడానికి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసింది? వంటి వివరాలను రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో డిజిటల్ టీవీల ద్వారా, టీవీ చాన్నాళ్ళలో ఇంటర్నెట్ లో విరివిగా ప్రచారం చేసినట్లయితే ఈ రద్దీని నియత్రించవచ్చును. ఈ పుష్కరాలను నిర్వహిస్తున్న స్థానిక అధికారులే స్వయంగా ప్రజలను వేర్వేరు ఘాట్స్ వైపు మళ్ళించడం మంచిది. ప్రజలు కూడా రాజమండ్రిలోనే పుష్కర స్నానాలు చేయాలనుకోకుండా మిగిలిన 12 రోజుల్లో ఖాళీగా ఉన్న వేర్వేరు ఘాట్స్ స్నానాలు చేయడం మంచిది.

 

పుష్కర ఘాట్స్ లో ఖాళీ ఉందని రూడీ చేసుకొంటే తప్ప చిన్న పిల్లలను, వృద్ధులను తీసుకు వెళ్ళకపోవడమే మంచిది. పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళ కోసం పోస్టల్ శాఖ గోదావరి పుష్కర జలాలను ప్యాకెట్ల ద్వారా ఇంటికే అందిస్తోంది. పుష్కర మంత్రం చదువుకొని ఆ నీళ్ళను నెత్తిన జల్లుకొన్నా చాలని వేదపండితులు చెపుతున్నారు. కాశీ వెళ్లి గంగలో మునగలేక పోయినవారు అక్కడికి వెళ్లి వచ్చే తమ బంధు, మిత్రుల ద్వారా కాశీ నుండి గంగను తెప్పించుకొని, ఇంట్లో ఉంచుకొని అవసరమయినప్పుడు అదేవిధంగా చేయడం హిందువులు అందరికీ తెలిసిన విషయమే. కనుక గోదావరి పుష్కరాలకు వెళ్ళలేని వారు కూడా ఈ పద్ధతినే ఆశ్రయించడం మంచిది.

By
en-us Political News

  
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.