మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉధృతి
Publish Date:Jul 12, 2025
Advertisement
భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీకి చేరువలో ఇక్కడ నీటిమట్టం ఉంది. ప్రజలు నదిలోకి దిగకుండా, లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.వరద కారణంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగే అవకాశం ఉంది. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం ఆరు గంటల సమయానికి భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం 40.40 అడుగులకు చేరింది. నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
http://www.teluguone.com/news/content/godavari-flood-reaches-near-to-1st-danger-caution-39-201811.html





