గోవాలో భారీ అగ్ని ప్రమాదం...25 మంది మృతి
Publish Date:Dec 7, 2025
Advertisement
గోవా రాష్ట్రాన్ని మరోసారి విషాదం కమ్మేసింది. ఉత్తర గోవా ఆర్పోరాలోని రోమియో లేన్‌లో ఉన్న ప్రముఖ బిర్చ్ నైట్ క్లబ్‌లో అర్థరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 25 మంది ప్రాణాలను బలిగొంది. క్లబ్ కిచెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. మంటలు క్షణాల్లోనే మొత్తం ప్రాంగణాన్నే చుట్టేసి నైట్ క్లబ్‌ను అగ్నికి ఆహుతి చేశాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులతో సహా మొత్తం 23 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అందులో ముగ్గురు సజీవదహనం కాగా, మిగిలిన వారు తీవ్రమైన పొగలతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో క్లబ్‌లో జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నారని... ప్రాణ నష్టం పెరగడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.అగ్ని మాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే పలు ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిన విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల గుర్తింపు కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని అధికారులు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో నైట్ క్లబ్‌లు, పర్యాటక వేదికలపై కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ఈ ఘటన జరగడంతో రోమియో లేన్ ప్రాంతం మొత్తం విషాద వాతావరణంలో మునిగి పోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ అగ్ని ప్రమాదం స్థానికులను, పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. క్లబ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణమా? లేదా భద్రతా ప్రమాణాల లోపమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గోవాలో జరిగిన ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
http://www.teluguone.com/news/content/goa-nightclub-fire-36-210626.html





