రూ.1,500 కోట్లు ఆదా చేశామంటున్నారు.. మరి ఈ రహస్య జీవోలేంటి?

Publish Date:Jun 13, 2020

Advertisement

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం ఏపీ ప్రభుత్వంతో జీఎంఆర్‌ ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందానికి సంబంధించి జీవో కూడా విడుదలైంది. కానీ జీవోను ఓపెన్ చేస్తే మాత్రం అందులో వివరాలు వెల్లడించకుండా కాన్ఫిడెన్షియల్ అని చూపిస్తుంది. దీంతో, ఒప్పందం జీవోను ప్రభుత్వం ఎందుకు రహస్యంగా పెట్టిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంకోసం గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. కానీ, అప్పుడు అందులో స్కాం జరిగిందని, ఇప్పుడు తాము వందల కోట్లు ఆదా చేశామని జగన్ సర్కార్ చెబుతోంది. సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం అయితే లెక్కలతో సహా చెబుతున్నారు. "భోగాపురం విమానాశ్రయం‌ నిర్మించేందుకు జీఎంఆర్‌ తో గతంలో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 2,700 ఎకరాల భూమిని కేటాయించింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై జీఎంఆర్‌ సంస్థతో సంప్రదింపులు జరిపింది. విమానాశ్రయం నిర్మాణాన్ని 2,200 ఎకరాలను పరిమితం చేసింది. దాంతో ప్రభుత్వానికి 500 ఎకరాల భూమి మిగిలింది. ఆ భూమి విలువ రూ.1,500 కోట్లు. తద్వారా ప్రభుత్వం రూ.1,500 కోట్లు ఆదా  చేసింది." అని చెప్పుకొచ్చారు. మరి అంత ఆదా చేసినప్పుడు రహస్య జీవో ఎందుకిచ్చారు? అసలు ప్రజలకు తెలియకుండా దాచాల్సిన అవసరం ఏముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో భోగాపురం విమానాశ్రయంలో పెద్ద స్కామ్ ఉందని, జీఎంఆర్ కు ఇచ్చేందుకే చంద్రబాబు సర్కారు కుట్ర చేసిందని అజేయకల్లం ఆరోపించారు. టిక్కెట్ల ధరలో వాటా అనటం వల్ల సర్కారుకు నష్టం అని ఆర్ధిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆ సంస్థకు అడ్డగోలుగా ఎలా రాయితీలు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు జగన్ మొదలుకొని అనేకమంది వైసీపీ నేతలు ఈ ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. మరి అప్పుడు జీఎంఆర్ ని విమర్శించిన జగన్.. ఇప్పుడదే జీఎంఆర్ తో ఒప్పందం ఎలా చేసుకున్నారు?. అసలు రూ.1,500 కోట్లు కోట్లు చేస్తే ఇలా రహస్య జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది?. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని చెబుతున్న జగన్ సర్కార్.. ఇలా రహస్య జీవోలు ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (DSC) నియామకాల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది.
భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది.
దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది.
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.