కాలుష్యపు దెబ్బకు రీసైక్లింగ్ మందు...

Publish Date:Mar 18, 2023

Advertisement

ప్రతి సంవత్సరం, భూమి బిలియన్ల టన్నుల సహజ వనరులను ఇస్తోంది. ఇలా ఆలోచిస్తే మనం ఎంతో అదృష్టవంతులం. కానీ ఈ సహజవనరుల గురించి ఆలోచించాల్సింది మరొకటి ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ సహజవనరుల అన్నీ భవిష్యత్తులో ఏదో ఒకప్పుడు అయిపోతాయి. ఇలా సహజ వనరులు అయిపోవడానికి కారణం.. కేవలం మనం సహజవనరులను ఇష్టానుసారం వాడెయ్యడమే కాదు. ఆ సహజవనరుల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తూ.. వాటిని ప్రకృతికి నష్టం కలిగిస్తున్నాం. 

అందుకే మనం ఈ ప్రకృతిలో కలిపేసే వస్తువుల  గురించి మరోసారి ఆలోచించాలి - వృధా కాకుండ చూడాలి.

గత పదేళ్ల కాలం గమనిస్తే..  రికార్డు స్థాయిలో అత్యంత వేడిగా ఉంది. ఇప్పుడు అసమానమైన వాతావరణ మార్పులు, ఊహించని ప్రళయాలు  ఎదుర్కొంటున్నాము. మనం గణనీయమైన, వేగవంతమైన మార్పులు చేయకుంటే, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, మంచుగడ్డలు కరగడం, వివిధ దేశాలు, ప్రాంతాలు అంతమయ్యే దశకు చేరుకోవడం, అడవులు తగ్గిపోవడం వంటివి చాలా దారుణంగా తయారవుతాయి.  

ప్రపంచంలో పెరుగుతున్న పేదరికం, ప్రాంతాల  వలసలు, ఉద్యోగ నష్టాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కనుమారుగైపోతూ.. కరువు కారణంగా ప్రపంచమంతా దారిద్య్రం ఏర్పడుతుంది. మానవాళిని ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి శాశ్వతమైన మార్పులు చేసుకోవాలి. దీనికోసం ఐక్యరాజ్యసమితి గ్లోబల్ రీసైక్లింగ్ డే ని ప్రతి సంవత్సరం మార్చి 18 వ తేదీన జరుకునేలా ప్రకటించింది. 2030 నాటికల్లా.. కొన్ని లక్ష్యాలను ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా నిర్ణయించింది.  గ్లోబల్ గ్రీన్ ఎజెండాకు మద్దతుగా అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలు ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం మనం ఇప్పటికే చూస్తున్నాము.

రీసైక్లింగ్ అనేది వృత్తాకార ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం, ఇది మన సహజ వనరులను రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం 'సెవెన్త్ రిసోర్స్' (పునర్వినియోగపరచదగినవి) CO2 ఉద్గారాలలో 700 మిలియన్ టన్నులకు పైగా ఆదా చేస్తుంది. ఇది 2030 నాటికి 1 బిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేయబడింది. మన భవిష్యత్తును కాపాడటానికి మనుషుల్లో ఉన్న స్పృహ రీసైక్లింగ్ ప్రక్రియలో ముందు వరుసలో ఉంటుంది. అంటే.. భావితరాలకు మనం సహజవనరులను అందించాలనే స్పృహ మనతో ఈ ప్రకృతి సంరక్షణ పనులు చేయిస్తుంది.


మన విలువైన ప్రాథమిక వనరులను సంరక్షించడం, మన భూ గ్రహ భవిష్యత్తును సురక్షితం చేయడంలో రీసైక్లింగ్ ప్రాముఖ్యతను చాలా ఉంటుంది. ఈ  ప్రాముఖ్యతను గుర్తించడంలోనే ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకోబడుతుంది.  అందుకోసమే.. 2018లో గ్లోబల్ రీసైక్లింగ్ డే సృష్టించబడింది. ప్రపంచం ఏకతాటిపైకి వచ్చి భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలకు తగిన ఆలోచనలు, ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పడం గ్లోబల్ రీసైక్లింగ్ డే రోజు చేసే పని.  

గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్దేశించబడిన గ్లోబల్ రీసైక్లింగ్ డే లక్ష్యం రెండు రెట్లు:

రీసైక్లింగ్ అనేది గ్లోబల్ సమస్య కాకూడదని, ఇది చాలా ముఖ్యమైనదని  చెబుతారు. ఈ రీసైక్లింగ్‌కు ఒక సాధారణ, ఉమ్మడి విధానం తక్షణం అవసరమని ప్రపంచానికి తెలిసేలా చెప్పడం.

మన చుట్టూ ఉన్న వస్తువుల విషయానికి వస్తే, వనరులను వృధా చేయకూడదని ఈ భూమ్మీద ఉన్న అందరూ ప్రజలకు తెలియజేయడం.  

అవార్డులు రివార్డులు ఉన్నాయి దీనికి..

గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ రంజిత్ బాక్సీ ఇలా వ్యాఖ్యానించారు. “కరోనా కాలంలో  రీసైక్లింగ్ హీరోలు చేసిన విశిష్ట సహకారానికి మేము వారిని గుర్తించాలనుకుంటున్నాము. గత 12 నెలల్లో రీసైక్లింగ్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న వ్యక్తులు, సంఘాలు, వ్యాపారాల నుండి నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి. వారి ప్రయత్నాలు మన ప్రపంచం యొక్క పచ్చని భవిష్యత్తుకు దోహదపడతాయి.

రీసైక్లింగ్ అనేది వాతావరణ మార్పు చక్రంలో అంతర్భాగం. ప్రపంచ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో, రక్షించడంలో సహాయపడుతుంది. రీసైక్లింగ్ 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల CO 2 ఉద్గారాలను ఆదా చేస్తుందని అంచనా వేయబడింది . ఈ అవార్డు కింద 1000 అమెరికన్ డాలర్లు బహుమానంగా ఇస్తారు.

కలుషితమైపోతున్న ఈ ప్రపంచాన్ని కాపాడుకోవడం మన చేస్తుల్లోనే ఉంది. మన చుట్టూ ఉన్న వనరులను దీర్ఘకాలంగా, పొదుపుగా ఉపయోగించుకోవాలి. అలా చేస్తే మన వంతు ప్రయత్నంలో మనం సఫలమే..

                                  ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.