బాలికల హక్కులే వారి భవితకు చుక్కాని!!

Publish Date:Oct 11, 2023

Advertisement

‘ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆశీర్వాదాన్ని పొందినట్టే’, ‘ఆడబిడ్డ పుడితే అదృష్టం’అనే మాటలు ఊరకనే రాలేదు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళ, సందడి, సంతోషం వెలకట్టలేనివి. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆడపిల్లలు ఉన్నవారికే అర్థమవుతుంది. ఇక ఆడపిల్లను సరైన విలువలు, విద్యతో పెంచే తల్లిదండ్రులు మెరుగైన సమాజానికి బాటలు వేస్తున్నట్టేనని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, నాణేనికి మరోవైపు అన్నట్టుగా.. ఈ సమాజం ఆడపిల్లలకు  ఒక సమస్యల సుడిగుండమే అని చెప్పాలి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన దగ్గర నుంచి తిరిగి లోపలికి వెళ్లే  అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు బాలికలకు కొన్ని ప్రత్యేక హక్కులు ఏర్పాటు చేశారు. ఈ హక్కులను గుర్తించడం, సవాళ్లను అధిగమించడంపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది అక్టోబర్ 11న ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు. ఈ మేరకు డిసెంబర్ 19, 2011న జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటన చేసింది. ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికల దినోత్సవం చరిత్ర, విశేషాలను గమనిద్దాం...

చరిత్ర ఏం చెబుతోంది...

బాలికలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలను నియంత్రించి, వారి హక్కులపై అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళల ఆత్మగౌరవం రక్షణ కోసం పోరాడిన ఉద్యమకారుడు, అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్‌వెల్డ్ పుట్టిన రోజయిన అక్టోబర్ 11న ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐరాస నిర్ణయించింది. ఈ మేరకు 19 డిసెంబర్ 2011న జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో తీర్మానం జరిగింది. అక్టోబర్ 11, 2012న తొలి అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించాలని ఆమోదించారు. ఈ తీర్మానానికి అనుకూలంగా సభ్యదేశాలు పెద్ద సంఖ్యలో ఓటు వేశాయి. విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహాలు వంటి విషయాల్లో బాలికలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లింగ అసమానతలపై అవగాహన కల్పించడమే ముఖ్యొద్దేశ్యంగా ఇది సాగుతుంది. ఇక బాలికలు, యువతులు వారివారి రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను చేపడతారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వివిధ కార్యక్రమాల ద్వారా బాలిక అభ్యున్నతికి తోడ్పాటునందించే ప్రయత్నం చేస్తాయి. భారతదేశంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతుంటాయి. నారీశక్తి అని, మహిళా రిజర్వేషన్లు అని ఎన్ని అడుగులు ముందుకు వేసినా కొందరు మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు.

2023 థీమ్ ఏంటంటే...

అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన థీమ్‌తో వేడుకలు నిర్వహిస్తుంటారు. ‘‘బాలికల హక్కుల్లో పెట్టుబడి: మన నాయకత్వం, మన సంక్షేమం’’ 2023 థీమ్‌‌గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాలికలకు రక్షణ, విద్య, ఆరోగ్యంగా జీవించే హక్కులపై అవగాహన కల్పించడమే ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం. బాలికల హక్కులు కేవలం చిన్నవయసులోనే కాదు.. మహిళగా రూపాంతరం చెందే వరకు సంరక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది థీమ్ చాటి చెబుతోంది. బాలికల సాధికారతకు మరిన్ని అడుగులు వేయాలని చెబుతోంది. బాలికలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, కేవలం జెండర్ ఆధారంగా బాలికలు చవిచూస్తున్న లింగ అసమానత్వంపై అవగాహనను పెంపొందించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఆడపిల్లల సాధికారత పట్ల అవగాహన పొందడం, కల్పించడం, వీలైనంత మేర తోడ్పాటునందిస్తే అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి గొప్ప గౌరవమిచ్చినట్టవుతుంది. మీ చుట్టుపక్కల బాలికల పరిస్థితి గమనించి సానుకూలంగా స్పందిస్తే మీ వంతు బాధ్యత నిర్వహించినట్టే!


                                      *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.
5 Habits Every Father Should Give Up for His Daughter,Every Father Needs to Hear These 5 Parenting Tips,5 Habits to Leave Behind
Signs of a Healthy Family Environment,Healthy Family or Toxic EnvironmentIs Your Family Environment Healthy
పిల్లల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం , ఆలోచనా విధానం మొదలైన విషయాలలో  తల్లిదండ్రులిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు. తల్లి ప్రేమ, శ్రద్ధ పిల్లల భావోద్వేగ పునాదిని బలపరిస్తే.. తండ్రి ప్రవర్తన, క్రమశిక్షణ, మాటతీరు,   జీవనశైలి వంటివి  పిల్లలపై చాలా గట్టి  ప్రభావాన్ని చూపుతాయి.
ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం. భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది. భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది...
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో...
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం..
మొబైల్ వ్యసనం మీ మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిద్ర, మానసిక ఆరోగ్యంపై మొబైల్ వల్ల కలిగే సమస్యలు మరియు వాటి నుంచి బయటపడే మార్గాలను MindVision వేణుగోపాల్ ఈ వీడియోలో సులభంగా వివరించారు...
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది...
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.