బాలికకు కరోనా.. ఊరి జనం వెలివేత..
Publish Date:Jun 11, 2021
Advertisement
మనిషి, మనిషికి దూరం అవుతున్నాడు..మానవత్వం మరిచి వందలో ఉన్న మందకొడిగా బతకాలనుకుంటున్నాడు.. ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితులు మనవాడు ఎవడు, మన మరణాన్ని కోరేవాడు ఎవరని తెలుస్తుంది.. తాజాగా ఒక అమ్మాయిలో కరోనా వచ్చింది.. ఆ విషయం ఆ ఊరి పెద్దలకు తెలిసింది.. ఇక అంటే పెద్దలు తెల్ల పంచలు కట్టుకుని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఒక తీర్మానం చేశారు.. అదేంటో మీరే చూడండి.. కరోనా సోకిన బాలిక కావడంతో గ్రామస్తులు ఆమె పట్ల వివక్షత చూపారు. ఊళ్లో ఎవరు కరోనా బారిన పడలేదని ప్రస్తుత బాలికతో ఇబ్బందులు ఏర్పడతాయని గ్రామస్థుల బాలికను ఊరి బయటకు పంపించారు. విధిలేని పరిస్థితుల్లో బాలికతోపాటు తల్లి ఇద్దరూ కవర్లతో గుడారం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. గ్రామస్తుల వివక్షత, సఖి నిర్వాహకుల నిర్వాకంపై జనం మండి పడుతున్నారు. కరోనా బారినపడ్డ వారిపట్ల వివక్షత చూపకుండా వారికి ధైర్యం చెబుతూ ఐసోలేషన్ సెంటర్ కు తరలించాల్సింది పోయి అమానుషంగా ప్రవర్తించడం విమర్శలకు దారి తీస్తోంది. కరోనా ఈ ప్రపంచానికి వింత అనుభవం నేర్పిందనే చెప్పాలి.. డబ్బుంటే చాలు ఇంకా ఎవరు ఏం చేయలేరని.. ఉన్నోడైన, లేనోడైనా, పెడోదైనా పెద్దోడైన ఇలాంటి విపత్తు వస్తే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అని మంచి గుణపాఠం చెప్పింది..అల్లాగే కరోనా వచ్చిన సరే నాలాంటి ఇంకా ఎన్ని వైరుసులు వచ్చిన మనుషులు దైర్యంగా ఉండే ఎంతటి విపత్తునైనా జయించొచ్చని.. మనుషులు ఎప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలనే లాంటి గుణపాఠాలు ఎన్నో చెప్పింది కరోనా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.. అన్ని మాట్లాడుకుని మళ్ళీ ఇలాంటి దుశ్యర్యలకు పాలుపడుతున్నారు..
అది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి. ఆ గ్రామానికి చెందిన ఒక అమ్మాయికి కరోనా సోకింది. ఆ ఊరి పెద్దలంతా కలిసి ఆ బాలికను ఊరు బయట పంటపొలాల్లో వదిలేశారు. ఆ బాలిక తల్లి కూడా చేసేదేమిలేక ఆ అమ్మాయితో పాటు తల్లి పంట పొలాల్లో నల్లటి కవరుతో చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని ఇద్దరు నివాసముంటున్నారు. మైనర్ బాలికను ఇటీవల సఖి కేంద్రం నిర్వహకులు చేరదీసి ఆశ్రమం కల్పించగా రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సఖి కేంద్రం నిర్వాహకులు బాలికను స్వగ్రామం వీర్నపల్లిలో వదిలిపెట్టారు.
http://www.teluguone.com/news/content/girl-tested-corona-positive-39-117438.html





