జయంట్ కిల్లర్ యశస్విని రెడ్డి.. ఎవరీమె?

Publish Date:Dec 7, 2023

Advertisement

సీనియర్ నేత, కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి, పాలకుర్తి నుండి పోటీచేసిన ఎర్రబెల్లి దయాకరరావు ఈసారి చిత్తుగా ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి  అనే 26 ఏళ్ల యువతి యర్రబెల్లిపై 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఓటమికి ముందు ఎర్రబెల్లి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఒకసారి ఎంపీగా గెలిచారు.   ఏ పార్టీలో ఉన్నా ఆయన ఓటమన్నదే ఎరుగని నేతగా కొనసాగుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న  సమయంలో కూడా తెలుగుదేశం  అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఎర్రబెల్లి సునాయాసంగా గెలిచి సత్తా చాటారు. అలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నేతను కాంగ్రెస్ అభ్యర్థి,  26 ఏళ్ల యశస్విని రెడ్డి ఓడించి సంచలనం సృష్టించారు. అమెరికా నుండి వచ్చిన యశస్విని రెడ్డి చేతిలో దయాకర్ రావు ఓటమి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం చర్చ అంతా యశస్వినీ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆమె ఎవరు? రాజకీయ అనుభవం ఉందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం నెటిజనులు అంతర్జాలంలో పెద్ద ఎత్తున  సెర్చ్ చేస్తున్నారు. యశస్విని రెడ్డి బిటెక్ పూర్తి చేసి అమెరికాలో  ఉన్నతోద్యోగం చేస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకే వరంగల్  వచ్చారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి ఏకంగా మంత్రిపైనే గెలిచి సంచలన విజయం అందుకున్నారు. 

ఒక్క ఎర్రబెల్లి మాత్రమే కాదు.. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా వరంగల్‌ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ ప్రదీప్ రావును ఓడించారు. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్ మోహన్ రావు విజయం సాధించారు.  అది వేరే సంగతి. తన రాజకీయ అనుభవం అంత వయస్సుకూడా లేని యువతి చేతిలో  పరాజయం అంటే  ఎర్రబెల్లికి పరాభవమే అనడంలో సందేహం లేదు. మూడున్నర దశాబ్దాలుగా ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 37 ఏళ్లుగా ఎమ్మల్యేగా  ఉన్న వ్యక్తికి ప్రత్యర్థిగా పోటీలో దిగడమంటే ఆషామాషీ కాదు.  బాగా పాపులారిటీ, సత్తా ఉన్న నేతలే వెనక్కి జంకుతారు. కానీ అటువంటి వ్యక్తిని ఎదుర్కొని ఓడించి    యశస్విని రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఎర్రబెల్లి దయాకర్ ట్రాక్ రికార్డును బద్దలు కొట్టారు.  

నిజానికి యశస్వినీ స్థానంలో  ఆమె అత్త ఝాన్సీ రాణి పోటీ చేయాల్సి ఉంది. యశస్విని అత్త హనుమాండ్ల ఝాన్సీరెడ్డిది పాలకుర్తి నియోజకవర్గం. ఝాన్సీ కుటుంబానికి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఆమె పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పాలకుర్తి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ, ఆమె ఎన్నారై కావడం.. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయడానికి ఇబ్బంది ఎదురైంది. ఆమె భారత పౌరసత్వ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎన్నికల సమయానికి పౌరసత్వం రాకపోవడంతో.. ఆమె తన స్థానంలో యశస్వినీ రెడ్డిని దింపారు. యశస్వినీ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ.. గట్టిగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎర్రబెల్లిపై యశస్విని పోటీకి దిగడంతో.. ఆమె విజయంపై  అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే ఆమె ప్రచారంలో కాస్త తడబడ్డారు.. జై కాంగ్రెస్ అనబోయి జై కేసీఆర్ అంటూ ఒక సారి నినాదం చేసి ఇబ్బంది పడ్డారు కూడా. 

అయితే ఆరంభంలోని తడబాటును అధిగమించి ప్రచారాన్ని జోరెత్తించారు.  ప్రజాభిమానాన్ని గెలుచుకుని ఎర్రబెల్లి ట్రాక్ రికార్డును బద్దలు కొట్టి విజయం సాధించారు.  సీనియర్ రాజకీయ నేతగా.. మంత్రిగా ఎర్రబెల్లి ప్రజలకు సుపరిచితుడే అయినప్పటికీ,   యశస్విని రెడ్డి వైపే జనం మొగ్గు చూపారు.  సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి తీరుపై నియోజకవర్గ ప్రజలలో అసంతృప్తి, ఆగ్రహం వెల్లువెత్తాయి. దానికి తోడు కాంగ్రెస్ వేవ్..   అన్నిటికీ మించి కొత్త ముఖం, పిన్న వయస్సు, రాజకీయ అనుభవం లేని ప్రత్యర్థిపై విజయం సునాయాసమన్న అతి విశ్వాసంతో ఎర్రబెల్లి ఆరంభంలో పెద్దగా ప్రచారంపై దృష్టి పెట్టలేదు. పరిస్థితి గమనించి రంగంలోకి దిగేటప్పటికే చేయిదాటిపోయింది.  నియోజకవర్గంలో  అనుచరుల ఆగడాలు దయాకర్ రావుపై ప్రజలలో వ్యతిరేకతకు కారణమయ్యాయి. అదే యశస్వినికి ఓటు బ్యాంకుగా మారింది.  అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డికి ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి స్థానికంగా ఉన్న మంచి పేరు  ప్లస్ అయ్యింది. ఫలితాలలో యశస్విని మొదటి రౌండ్ నుంచే తన ఆధిక్యాన్ని కొనసాగించగా దయాకర్ రావు ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.