Publish Date:Feb 18, 2025
రాజకీయాలలో ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టడమే కాదు, పకడ్బందీగా ప్రతి వ్యూహాలనూ అమలు చేయాల్సి ఉంటుంది. ఎత్తులు, పై ఎత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నంత కాలం... ఆయన వ్యూహాలు, ఎత్తుగడలు ప్రత్యర్థుల అంచ నాలకు మించి ఉండేవి. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన పొలిటికల్ గా ఒకింత ఇన్ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు యాక్టివ్ అవుతానంటున్నారు అది వేరే సంగతి. కానీ ఈ లోగానే బీఆర్ఎస్ వ్యూహరచనలో, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టడంలో, వారి ఎత్తుగడలను అంచనా వేయడంలో విఫలమై పరువుపోగొట్టుకుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి జరిగే ఎన్నికలలో సంప్రదాయానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పోటీలో నిలవాలని నిర్ణయించుకుంది. ఇద్దరు అభ్యర్థుల చేత నామినేషన్ కూడా వేయించింది. బీజీపీ మద్దతుతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టాలని భావించింది. అందుకోసం బీజేపీతో చర్చలు కూడా జరిపింది. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలపాలన్న ఒప్పందానికి కూడా వచ్చాయి.
జీహెచ్ఎంసీ లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్ల కార్పొరేటర్ల నుంచి ఏటా స్టాండింగ్ కమిటీ లేదా స్టాండింగ్ కౌన్సిల్ కు 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగానే జరిగాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికలకు సిద్ధపడ్డాయి. వాటి ధైర్యం ఏమిటంటే 150 మంది కార్పొరేటర్లలో బీఆర్ఎస్ కు 56 మంది, బీజేపీకి 48 మంది ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది ఉన్నారు. కాంగ్రెస్ కు ఇద్దరు కార్పొరేటర్ల బలం మాత్రమే ఉండేది. అయితే 2023 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడంతో కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ బలం 24కు పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం 42కు, బీజేపీ బలం 40కి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపి కాంగ్రెస్ ను దెబ్బతీయాలని భావించాయి. ఎన్నికలకు సిద్ధమయ్యాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో నామినేషన్ల దాఖలుకు సోమవారం (ఫిబ్రవరి 17) చివరి తేదీ. సరిగ్గా చివరి నిముషంలో బీజేపీ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి పోటీ నుంచి వైదొలగింది.
ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఒక్క కార్పొరేటర్ కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహ రించుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. వారు ఉపసంహరిం చుకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. బీఆర్ఎస్ పరువు గంగలో కలుస్తుంది. అలా కాకుండా పోటీలో కొనసాగినా గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఎందుకంటే ఎంఐఎం, కాంగ్రెస్ చేతులు కలిపి పోటీలోకి దిగాయి. దీంతో ఎంఐఎం, కాంగ్రెస్ లకు కలిపి బలం 65కు పెరిగింది. అంతే కాకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు 42 మంది ఇన్ టాక్ట్ గా ఉంటారన్న నమ్మకం బీఆర్ఎస్ లోనే లేదు. దీంతో బీజేపీని నమ్మకుని బీఆర్ఎస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు రెడీ అయ్యి పరువుపోగొట్టుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ghmc-standing-committee-elections-brs-lost-pride-39-193052.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.