వారంలో గ్రేటర్ నోటిఫికేషన్! జోరుగా పార్టీల ఆకర్ష్ 

Publish Date:Nov 7, 2020

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నిక ముగియడంతో ఇప్పడు పార్టీలన్ని గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ చేశాయి. వారం రోజుల్లోనే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో నేతలు దూకుడు పెంచారు. జీహెచ్ఎంసీపై తమ పార్టీ జెండా పాతేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గ్రేటర్ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఎంతా వేగంగా చర్యలు తీసుకుంటుందో  అంతకంటే వేగంగా .. అధికారం కోసం పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. దీంతో బల్దియాలో ఇప్పుడు జంపింగుల పర్వం జోరందుకుంది. అన్ని పార్టీలు ఆకర్ష్ ఆపరేషన్ చేపట్టడంతో నేతల వలసలు ఊపందుకున్నాయి. 
              

రెండోసారి గ్రేటర్‌ హైదరాబాద్‌ పై పాగా వేయాలని భావిస్తున్న అధికార పార్టీ చాలా రోజుల క్రితమే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో సిటీ నేతలు ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే గ్రేటర్ లో తమను ఢీకొట్టేందుకు తహతహలాడుతున్న కమలం పార్టీకి.. ఝలక్‌ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ తన వ్యూహాలకు పదునుపెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికల నోటిపికేష్ కు ముందే బీజేపీని సిటీలో బలహీనం చేయాలని కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. నగరంలో కీలక బిజేపి నేతలను కారు ఎక్కించేలా ఆయన మంత్రాంగం జరుపుతున్నారని చెబుతున్నారు. కేటీఆర్ ప్లాన్ లో భాగంగానే జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌ శ్రీధర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారని చెబుతున్నారు. శ్రీధర్ రెడ్డి బాటలో పలువురు గ్రేటర్ కమలం నేతలు కూడా క్యూలో ఉన్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. 

 

గ్రేటర్ లో ఈసారి సెంచరీ కొడతామని చెబుతున్న కేటీఆర్.. తమకు ప్రధాన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్న బిజేపిని టార్గెట్ చేశారని చెబుతున్నారు. బీజేపీకి సరైన అభ్యర్థులే దొరకకుండా చేయాలని సిటీ టిఆర్ఎస్ కీలక నేతలకు కేటీఆర్‌ టాస్క్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. కేటీఆర్ అదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు నగరంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యాక్షన్ లోకి దిగారని చెబుతున్నారు. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టాక నగరంలోని కొందరు నేతలకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం ఉంది. అలాంటి నేతలందరిని టీఆర్ఎస్ లో చేర్పించేలా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ అసంతృప్త నేతలందరితో మాట్లాడుతూ వారిని కారెక్కించే పనుల్లో టిఆర్ఎస్ సీనియర్లు బిజీగా ఉన్నారని చెబుతున్నారు.  
 

బీజేపీ కూడా కారుకు కౌంటర్ గా స్పీడ్ పెంచింది. సిటీలోని టీఆర్ఎస్ నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. గతంలో టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన వారిలో చాలా మంది ఆపార్టీ లో అసంతృప్తిగా ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యేతో విభేదాలతో కొందరు, పార్టీలోని మరో గ్రూపుతో పడక మరికొందరు గులాబీ కార్పొరేటర్లు సైలెంటుగా ఉన్నారని గుర్తించిన బీజేపీ పెద్దలు.. వారందరిని తమ పార్టీలోకి తీసుకొచ్చేలా చర్చలు జరుపుతున్నారని సమాచారం. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. మరికొందరు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కీలక నేతలు కూడా త్వరలోనే కమలం గూటికి చేరుతారంటున్నారు. కోర్ సిటీలో ఇలాంటి  చేరికలు ఎక్కువగా ఉంసటాయని గ్రేటర్ కమలం నేతలు చెబుతున్నారు. 

 

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే , హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనింకా అధికారికంగా ప్రకటించలేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఆయనకు విభేదాలు ఉన్నాయని, కచ్చితంగా ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వెళుతారనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుత కార్పొరేటర్లలో కొందరికి టీఆర్ఎస్ పార్టీ ఈసారి టికెట్లు ఇవ్వకపోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది.  దీంతో అధికార పార్టీ టికెట్ నిరాకరించిన నేతలంతా తమ పార్టీలోకి వస్తారని గ్రేటర్ కమలం నేతలు అశిస్తున్నారు. 

 

ఇక గ్రేటర్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు వల వేస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమని భావిస్తున్న చాలా మంది నేతలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నగరంలోని హస్తం నేతలు చెబుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ పరిధిలోనే 45 డివిజన్లు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్దమంటూ అన్ని పార్టీలకు చెందిన నేతలతో తమతో టచ్ లోకి వచ్చారని పీసీసీ నేతలు చెబుతున్నారు. ఎంఐఎంపై గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఓల్డ్ సిటీలో కనిపిస్తుందని, తమ కొంత వర్కవుట్ చేస్తే పాతబస్తీలోనూ మంచి ఫలితాలు వస్తాయని గ్రేటర కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు. 

 

మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై అన్ని పార్టీలు పోకస్ చేయడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల వలసలతో పార్టీ కార్యాలయాల్లోనూ సందడి నెలకొంటుంది. రాబోయే రోజుల్లో జంపింగులు మరింత జోరుగా ఉంటాయని, ఎన్నికల నాటికి ఎవరూ ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.