జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టులో పిటిషన్
Publish Date:Dec 15, 2025
Advertisement
జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్ సేనరెడ్డి విచారణ చేపట్టారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వినయ్‌కుమార్ పిటిషన్‌లో తెలిపారు. డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. అనంతరం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రేపు బల్ధియా ప్రత్యేక కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. ఇప్పటి వరకు 1,328 అభ్యంతరాలు వచ్చాయిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
http://www.teluguone.com/news/content/ghmc-divisions-36-211021.html





