ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై దంపతులు ఆత్మహత్య..!
Publish Date:Jul 3, 2026
Advertisement
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన దంపతులు రవికుమార్, శిరీష దంపతులు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నివాసముం టున్నట్లు సమాచారం. ఈ దంపతులు నిన్న రాత్రి సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఘట్‌కేసర్– బీబీనగర్ రైల్వే మార్గంలో ఎన్ఎఫ్‌సీ సమీపంలో వీరి మృతదేహాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్య అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు. దంపతులు ఈ తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కుటుంబ, ఆర్థిక లేదా ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా? లేక ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటననా? అనే కోణాల్లో పోలీసులు విచా రణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో పాపాయిపేట గ్రామంతో పాటు కుంట్లూరు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా ఘటనకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/ghatkesar-railway-station-36-224946.html





