ముదిరి పాకాన పడ్డ గెహ్లాట్ పైలట్ వివాదం

Publish Date:May 15, 2023

Advertisement

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత  సచిన్ పైలట్  మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.  పైలట్ ..బాహాటంగానే.. గెహ్లాట్ పై సంచలన విమర్శలు చేశారు. గత  బీజేపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రశ్నపత్రాల లీకేజీపై ఈ నెలాఖరులోపు చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆయన చేపట్టిన అయిదు రోజుల జన్ సంఘర్ష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జైపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు.  తమ డిమాండ్లను ఈ నెలాఖరులోపు అంగీకరించకపోతే ప్రతి గ్రామంలోనూ ఆందోళన చేపడతామని, తాను దేనికీ భయపడనని, పదవిలో ఉన్నా, లేకున్నా రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాననీ చెప్పిన పైలట్ తననెవరూఅణచివేయలేరన్నారు. పార్టీలో విభేదాల గురించి మాట్లాడుతూ ఆయన గెహ్లాట్ వర్గంపై పరోక్ష విమర్శలు చేశారు.

గెహ్లాట్ నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ తాము కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానన్నారు. 2020లో  ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు బీజేపీ నేత వసుంధర రాజే అండగా నిలిచారంటూ ఇటీవల గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపైనా పైలట్ పరోక్షంగా స్పందించారు.  గెహ్లాట్ తన సొంత పార్టీ నేతలను తూలనాడుతూ  ప్రత్యర్థి పార్టీల నేతలను ప్రశంసిస్తున్నారు.  అయినా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులు తప్ప ఇంకేవీ పనిచేయవని పైలట్ పేర్కొన్నారు.

ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానంపెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఇరువురు నేతలతో చర్చించి వారి మధ్య మనస్పర్ధలు తొలిగించడంపై హై కమాండ్ దృష్టి సారించడం లేదు. వివాదాన్ని పరిష్కరించకుంటే.. ఇది మరో  మధ్యప్రదేశ్ అంటే కమలనాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్ గా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.