జగన్ తో హాయ్.. కేసీఆర్ తో కటీఫ్.. బీజేపీ నయా స్టాండ్!

Publish Date:Sep 11, 2020

Advertisement


టీఆర్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందా?.. టీఆర్ఎస్ కలిసిరాకున్నా కేంద్రంలో నష్టం లేదని కమలం భావిస్తుందా?.. గులాబీ బాస్ బీజేపీని టార్గెట్ చేస్తోంది అందుకేనా? అంటే అవుననే సమాధానమే 
వస్తోంది. గతంలో కేంద్ర బిల్లుల ఆమోదానికి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు తీసుకుంది ఎన్డీఏ సర్కార్. కాని ప్రస్తుతం మాత్రం సీన్ మారింది. టీఆర్ఎస్ మద్దతు అవసరం లేదనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే త్వరలో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు కోరడం లేదు 

ఈ నెల 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన్నే మరోసారి  అభ్యర్ధిగా నిలబెట్టింది ఎన్డీయే. ఎగువసభలో తమకు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఆయనకు మిగతా పార్టీల  మద్దతు కూడగడుతోంది బీజేపీ కూటమి. రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్న వైసీపీ మద్దతు కోరింది. హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు మద్దతివ్వాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఫోన్‌ చేశారు. గతంలో హరివంశ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌ చేసేందుకు వైసీపీమద్దతిచ్చింది. దీంతో మరోసారి తమ మద్దతు కొనసాగించాలని నితీశ్‌ కోరగా.. జగన్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. 

రాజ్యసభలో టీఆర్ఎస్ కు ఏడుగురు సభ్యులున్నారు. అంటే వైసీపీ కంటే ఒకరు ఎక్కువే. కాని ఇంతవరకు ఎన్డీయే కేసీఆర్ ను మద్దతు కోరలేదు. బీహార్ సీఎం నితీశ్ తో కేసీఆర్ కు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలున్నాయి. అయినా నితీశ్ కుడా టీఆర్ఎస్ మద్దతు కోసం ప్రయత్నించడం లేదు. బీజేపీ సూచనల ప్రకారమే జగన్ తో మాట్లాడిన నితీశ్.. కేసీఆర్ తో కాంటాక్ట్ కాలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కు కారు పార్టీ ఎంపీలు మద్దతిచ్చారు. 
గత ఆరేండ్లుగా కేంద్రంలో మోడీ సర్కార్ తో మంచి సంబంధాలు కొనసాగించింది టీఆర్ఎస్. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు మద్దతు ఇచ్చింది. అయితే కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య తేడాలు వచ్చినట్లు సమాచారం. 

గతంలో ప్రధాని మోడీని ప్రశంసించిన సీఎం కేసీఆర్.. ఇటీవల మాత్రం కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారని, న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్రంతో సమరానికి సిద్ధమంటున్నారు గులాబీ బాస్. బీజేపీతో తనతో సరిగా వ్యవహరించడం లేదనే కారణంగానే కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను గమనిస్తున్న బీజేపీ.. ఆయన్ను దూరం పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ సపోర్ట్ అవసరం లేదనే భావనలో బీజేపీ.. కేంద్రంతో పోరాడాలనే యోచనలో కారు పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది. 

మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల తరఫున మనోజ్‌ ఝాను నిలబెట్టాలని కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఆయనకు కాంగ్రెస్‌, ఆర్జేడీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్షాలు మద్దతివ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 87, కాంగ్రెస్ కు 40 మంది సభ్యులున్నారు. బలాబలాల ప్రకారం మరోసారి ఎవ్డీయే అభ్యర్ధికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
 

By
en-us Political News

  
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.