నా స్థాయికి కార్పొరేషన్ చైర్మన్ పదవా నో.. గంటా నిరాసక్తత?

Publish Date:Jan 28, 2026

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులకు తెలుగు దేశం కూటమి ప్రభుత్వం పదవులను కేటాయిస్తున్నది. ఇలా దక్కిన పదవులను కొందరు అవకాశంగా భావిస్తుంటే.. కొందరు సీనియర్ నేతలు మాత్రం ఆ పదవులను నిరాకరిస్తున్నారు. అలా ప్రభుత్వం ఇచ్చిన పదవి వద్దంటున్న వారిలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒకరు.  తాజాగా ఎకనామికల్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా క్యాబినెట్ హోదా ఉన్న పదవిని గంటా శ్రీనివాసరావుకు ఇవ్వాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పదవి పట్ల గంటా ఏ మాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన చంద్రబాబు కేబినెట్ లో స్థానం కోసం పోటీ పడ్డారు.  అయితే కూటమి సర్దుబాట్ల కారణంగా గంటాకు అవకాశం దక్కలేదు. ముఖ్యంగా   ఉమ్మడి విశాఖ జిల్లా  సామాజిక సమీకరణాలు, మహిళలకు ప్రాధాన్యత వంటి అంశాలతో  వంగలపూడి అనితకు మంత్రి పదవి ఇచ్చారు.

అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కి స్పీకర్ పదవి దక్కింది.   పల్లా శ్రీనివాసరావుకు  అధ్యక్ష పదవి దక్కింది. సామాజిక సమీకరణాలు, మహిళలకు ప్రాధా న్యత లక్ష్యంగా ఈ కేటాయింపులు జరిగాయి. అయితే గంటాకు మంత్రిపదవి దక్కకపోవడం పట్ల ఆయనతో పాటు ఆయన వర్గం కూడా ఒకింత అసంతృప్తితో ఉందని రాజకీయవర్గాలలో ఓ చ ర్చ అయితే జరుగుతోంది.  ఇక గంటా తన ఆశలన్నీ మంత్రివర్గ విస్తరణపై పెట్టుకున్నారని అంటున్నారు. విస్తరణ జరిగితే తనకు కచ్చితంగా కేబినెట్ లో స్థానం దక్కుతుందని ఆయన భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు లేకపోవడంతో  ఆశావహులకు కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇతర పదవులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ దశలో గంటా శ్రీనివాసరావుకు ఒక క్యాబినెట్ హోదాతో  పదవి ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ పదవి తీసుకోవడానికి గంటా శ్రీనివాసరావు సుముఖంగా లేరని అంటున్నారు.

 రాజకీయాల్లో దాదాపు 27 సంవత్సరాలుగా నిరాఘాటంగా చట్టసభల్లో కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు..  1999లో అనకాపల్లి ఎంపీగా అరంగ్రేటం చేశారు. ఆ తరువాత ఆయన   చోడవరం భీమిలి.. అనకాపల్లి, విశాఖ నార్త్... ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు.  అలాగే   గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ, ఆపై చంద్రబాబు నాయుడు హయాంలోనూ కూడా గంటా మంత్రిగా పని చేశారు.ఈ నేపథ్యంలోనే  ఒక కార్పొరేషన్   చైర్మన్ పదవి తన కు తగదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

 ఇలా ఉండగా, గంటా శ్రీనివాసరావు తో పాటు ఇతరుల కు ఇచ్చే పదవులపై   ప్రభుత్వం వ్యూహాత్మకంగా  లీకులు వదిలినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ లీకుల ద్వారా  ఆయా నేతల మనోభావాలను గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు విషయంలో  చేసినట్లు చెబుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన తన స్థాయికి కార్పొరేషన్ చైర్మన్ పదవి సరికాదని గంటా భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.