Publish Date:Apr 30, 2022
ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంగా విడుదలైన ‘పుష్ప’ సినిమా ఇఫ్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆ సినిమాలోలాగే పోలీసులకు దొరక్కుండా గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు కొత్త కొత్త టెక్నిలను ఉపయోగిస్తున్నారు.
పోలీసులకు చిక్కకుండా ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చో వెండి తెర మీద 70 ఎంఎంలో చూపింది పుష్ప సినిమా. అదే టెక్నిక్ ఫాలో అయ్యి గంజాయి స్మగ్లింగ్ చేసేద్దామనుకుని అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. అలా దొరికిపోయిన వారు నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ అనుచరులని ఆరోపిస్తూ తెలుగుదేశం ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో గంజాయి స్మగ్లింగ్ కు వారు అనుసరించిన టెక్నిక్, పోలీసులకు దొరికిపోయిన విధం ఉన్నాయి. లారీ కింద గంజాయి బస్తాలు పెట్టి స్మగ్లింగ్ చేస్తూ స్మగ్లర్లు దొరికి పోయిన వీడియోను తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో పోస్టు చేసింది. లాంగ్ ట్రాలీ ఉన్న లారీలో ఓపెన్ టాప్ ట్రాలీలో ఇనుపవైర్ల లోడు ఉంచి..ట్రాటీకీ, యాక్పిల్ కు మధ్య ఉండే ఇనుప కమ్మీలపై పెద్ద సంఖ్యలో గంజాయి బస్తాలు ఉంచారు. పోలీసుల తనిఖీలో అవి బయటపడటంతో లారీనీ, గంజాయి బస్తాలనూ సీజ్ చేసి, అందులో ఉన్న వారిని అదుపులోనికి తసుకున్నారు. ఆ లారీలో ఉన్న వారు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులని తెలుగుదేశం ఆరోపించింది. ఇంతకీ నర్సీపట్ల వైసీపీ ఎమ్మెల్యే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నథ్ సోదరుడు కావడం విశేషం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ganja-smuggling-in-pushpa-style-ycp-hand-behind-it-25-135277.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!