ఇక దాదా పొలిటికల్ ఇన్నింగ్స్..బీసీసీఐ అధ్యక్ష పదవికి గుడ్ బై!

Publish Date:Jun 1, 2022

Advertisement

ఇండియన్ క్రికెటర్ లో అత్యంత దూకుడు ప్రదర్శించిన కెప్టెన్ గా గుర్తింపు పొందిన గంగూలీ ఇక పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఇంత కాలం క్రికెట్ కు సేవ చేశాననీ, ఇక దానిని చాలించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇక తాను ప్రజాసేవకే అంకితమవ్వాలని భావిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆయన బీజేపీతో కలసి తన రాజకీయ జీవితం ప్రారంభించనున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికే పలు మార్లు ఆయన బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. గంగూలీ భార్య కూడా తన భర్త బీజేపీ గూటికి చేరే అవకాశాలున్నాయని పేర్కొన్న నేపథ్యంలో గంగూలీ కొత్త ఇన్నింగ్స్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

టీమ్ ఇండియా కెప్టెన్ గా జట్టులో పోరాట స్ఫూర్తిని నింపిన గంగూలీ జట్టును యువరక్తంతో నింపేశారు. క్రికెట్ లో ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ గురించి, మైండ్ గేమ్ గురించి క్రీడాభిమానులందరికీ తెలిసిందే. అటువంటి ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ ను ఎదుర్కొనడమే కాకుండా, తిరిగి అంతే దూకుడుగా బదులిచ్చిన గంగూలీ దూకుడును క్రికెటర్లందరూ అప్పట్లో ప్రశంసించారు. మొదటి నుంచీ కూడా గంగూలీకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

గంగూలీ బీసీసీఐ చీఫ్ కావడానికి అమిత్ షా సహకరించారని అంటారు. కాగా గంగూలీ రాజీనామా వార్తలను బీసీసీఐ ఖండించింది. అధికారికంగా రాజీనామా చేయనప్పటికీ, బీసీసీఐ నుంచి గంగూలీ బయటకు రావడం లాంఛనమేనని గంగూలీ సన్నిహితులు చెబుతున్నారు. గంగూలీ ప్రవేశంతో బెంగాల్ ల బీజేపీకి కొత్త జోష్ వస్తుందని బీజేపీ భావిస్తోంది.  

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.