Publish Date:Aug 31, 2022
రాష్ట్రగవర్నర్ తమిళిసై ఖైరతా బాద్ మహాగణపతిని దర్శించు కుని తొలి పూజ చేశారు. గణేషు ని దర్శనానికి వచ్చిన జనసందో హాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, అందరి ఐకమత్యానికి ఈ పం డుగ గొప్ప నిదర్శనమని అన్నా రు. అందరికీ వినాయక చవితి శుభా కాంక్షలు తెలిపారు.
ఈ ఏడాది పంచముఖ మహా లక్ష్మిగణపతిగా ఖైరతాబాద్ బడా గణేష్ భక్తులకు దర్శన మిస్తు న్నారు. తొలిసారి 50 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ గణేష మండపం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహాగణపతి దర్శనానికై భక్తుల కోసం నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌లో మహా గణ పతి దర్శనానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తుల తాకిడి మొదలు కావడంతో ఆ ప్రాంతంలో పోలీసు లు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గణేష్ మండపం ఎదురుగా ఉన్న ప్రదాన నాలుగు రహదారులు నిఘా నీడలోకి వెళ్లాయి. ప్రధాన మెటల్ డిటెక్టర్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ తరువాతే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.
ఈసారి భారీభద్రత సెక్యూరిటి వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. మూడు షిఫ్ట్‌లో 360 పోలీసులు విధులు నిర్వహి స్తున్నారు. క్రైమ్ టీమ్స్, షీటీమ్స్, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీంమ్స్, ఐడీ పార్టీలు, టీఎస్ పోలీస్ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో పాటు షాడో టీంమ్స్ రంగంలోకి దిగాయి. అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని వెల్ నెస్ సెంటర్ హాస్పిటల్‌లో సెంట్రల్ జోన్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసందానం చేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రం వచ్చాక గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి ని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం తలసాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలను ఘనంగా చేయమని ఆదేశాలు ఇచ్చారన్నారు. బోనాలు, బతుకమ్మ, గణేష్ ఉత్సవాలు ఇలా అన్ని పండుగలను ఎంతో ఘనంగా చేస్తున్నామని తెలిపారు. అన్ని పండుగలు నిధులు మంజూరు చేసి పండుగలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఖైరతాబాద్ గణేష్‌ను మట్టితో తయ్యారు చేసి అందరికి ఆదర్శం నిలిచారని అన్నారు. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ganesh-utsav-is-a-demonstration-of-unity-governor-tamilisee-39-142978.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.