Publish Date:Aug 20, 2022
అమెరికాలో గాంధీ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. జాతి విద్వేష దురహంకారంతోనే ఈ చర్యకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్ సౌత్ రిచ్మండ్ హిల్‌లోని శ్రీ తులసీ మందిర్ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంన్ని కొందరు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సుత్తితో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఆ ఫుటేజీల్లో స్పష్టం అవుతోంది. మొదట ఒకరు గాంధీ విగ్రహ ధ్వంసానికి పూనుకోగా, ఆ తరువాత మరికొందరు వచ్చి చేరారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తరువాత వారంతా రెండు కార్లలో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారంతా పాతిక, 30 ఏళ్ల మధ్యవయస్కులేనని చెబుతున్నారు. కాగా ఈ ఘటనను భారత్ తీవ్రండగా ఖండించింది. న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళింది.
న్యూయార్క్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి అవమానం జరగడం గడిచినరెండు వారాల్లో ఇది రెండో సారి. తాజాగా దాడిలో దుండగులు పెయింట్‌తో విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు. ఆగస్టు 3న కూడా ఇదే విగ్రహంపై దాడి జరిగింది.
గాంధీ విగ్రహంపై దాడి ఘటనను న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు జెన్నిఫర్ రాజ్ కుమార్ ఖండిస్తూ ఓ ప్రకటన చేశారు. దుండగులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gandhi-statue-vandalised-in-newyork-25-142290.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.