కృష్ణాజిల్లాని ఈ రాక్షసుడి చేతిలో పెట్టారేంటో!

Publish Date:Jul 29, 2024

Advertisement

కృష్ణాజిల్లా ఎస్పీగా గంగాధరరావుని నియమించడం కృష్ణాజిల్లా పోలీసు శాఖలో మాత్రమే కాకుండా, తెలుగుదేశం పార్టీలో కూడా చర్చకు దారితీసింది. జగన్ పార్టీతో ఐదేళ్ళు అంటకాగి, జగన్ చెప్పినట్టల్లా ఆడి, తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను వేధించిన గంగాధర్‌ని ఇప్పుడు కృష్ణాజిల్లా ఎస్పీగా చంద్రబాబు నియమించారు. గంగాధర్ తన ప్రతాపాన్ని కేవలం టీడీపీ క్యాడర్ మీద మాత్రమే చూపించలేదు.. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు మీద కూడా తన అధికార దుర్వినియోగాన్ని ప్రయోగించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా గంగాధర్ వున్న సమయంలో అంగళ్ళు ఘటనలో చంద్రబాబు మీద, తెలుగుదేశం నాయకుల మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసిన ఘనత గంగాధర్‌దే. చంద్రబాబు మీద రాళ్ళ దాడి చేసిన వారిని వదిలేసి, రాళ్ళదాడికి గురైన చంద్రబాబు తదితరుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన గొప్ప పోలీస్ ఆఫీసర్ గంగాధర్. సాధారణంగా అయితే ఇలాంటి ఆఫీసర్ని ఏదైనా ప్రాధాన్యం లేని పోస్టులో నియమిస్తారు. కానీ, ఏకంగా కృష్ణాజిల్లా ఎస్పీగా నియమించడం తెలుగుదేశం నాయకులు మింగుడు పడటం లేదు.

వైసీపీ ప్రభుత్వం వుంది కాబట్టి గంగాధర్ అప్పట్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి వుండొచ్చు అనడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆయన ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ మీద కొద్ది రో్జుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన మీద ఆయన ఫిర్యాదు చేయలేదు. అలాగే రాజకీయ రంగు కూడా పులమలేదు. ఈనెల 17న కృష్ణాజిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ గుడివాడకి వెళ్ళి లక్ష్మోజీని పరామర్శించారు. తన మీద జరిగిన దాడి ఘటన మీద కేసు నమోదు చేయించారు. గంగాధర్ ఇదంతా కొడాలి నాని ఆదేశాల మేరకు చేస్తున్నారని, ఈ దాడి ఘటన కేసుని తెలుగుదేశం నాయకుల మీదకి నెట్టే ఉద్దేశంతోనే గంగాధర్ ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చంద్రబాబు నాయుడు అతి మంచితనంతో ఇలాంటి నాయకుడికి కృష్ణాజిల్లా ఎస్పీలాంటి కీలక పదవిలో కూర్చోబెట్టడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పాలనలో తన రాక్షసత్వాన్ని చూపించిన గంగాధర్ చేతిలో క‌ృష్ణాజిల్లాని చంద్రబాబు పెట్టారని అంటున్నారు.

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.